డ్రైవర్ కు ఫిట్స్ .. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు..
రొమేనియాలో డ్రైవర్ స్పృహ కోల్పోవడంతో మెర్సిడెస్ కారు గాల్లోకి లేచి, బస్సులు, కార్లపై నుంచి దూకి పోల్‌ను ఢీకొంది. సీసీటీవీలో రికార్డైన ఈ 'సినిమా' ప్రమాదం వీడియో వైరల్‌గా మారింది. తీవ్ర గాయాలతో బయటపడిన డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, లైసెన్స్ రద్దు చేసి, జరిమానా విధించారు. ఇది అద్భుతమైన తప్పించుకోలుగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.
కారులో వెళుతుండగా డ్రైవర్ స్పృహ కోల్పోయాడు. యాక్సలరేటర్‌ను బలంగా నొక్కడంతో కారు గాల్లోకి లేచింది. ఎదురుగా వస్తున్న బస్సు, కార్ల పైనుంచి ఎగురుకుంటూ వెళ్లి ఓ పోల్ ను ఢీ కొట్టింది. సినిమా సీన్‌ని తలపించిన ఈ ఘటన రొమేనియాలో జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రొమేనియాలోని ఒరాడియా సిటీలో 55 ఏళ్ల వ్యక్తి తన మెర్సిడస్ కారులో వెళుతుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. మధుమేహంతో బాధపడుతుండడంతో సడెన్ గా స్పృహ కోల్పోయాడు. దీంతో కారు అతి వేగంగా దూసుకెళ్లి అదుపుతప్పి రాంగ్ రూట్ లోకి వెళ్లింది. డివైడర్ ను ఢీ కొట్టి గాల్లోకి లేచింది. ఎదురుగా వస్తున్న ఓ బస్సు, దాని వెనకే ఉన్న రెండు కార్ల పైనుంచి వెళ్లి ఓ పోల్ ను ఢీ కొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ 55 ఏళ్ళ డ్రైవర్ ను ఎమర్జెన్సీ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతనికి చికిత్స అందిస్తున్న వైద్యులు.. ప్రస్తుతం ప్రాణాపాయం లేదని తెలిపారు. భారీ ప్రమాదం నుంచి మృత్యుంజయుడిలా డ్రైవర్ బయటపడటం అద్భుతం అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. డ్రైవర్ లైసెన్స్ ను 90 రోజులు క్యాన్సిల్ చేయడంతో పాటు 1600 రొమేనియన్ లియు అంటే రూ.27 వేల రూపాయల జరిమానా విధించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆధార్‌పై కీలక అప్‌డేట్.. దాని కోసం QR కోడ్ తప్పని సరి
Vande Bharat: డిసెంబర్లో కూత పెట్టనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు
బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!
డ్రైవర్ కు ఫిట్స్ .. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు..
బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!
చైనా అమ్మాయి వెడ్స్ ఝార్ఖండ్ అబ్బాయి..
విచిత్ర వివాహం.. శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడిన యువతి
సర్పంచ్ బరిలో అతని ఇద్దరు భార్యలు.. చివరికి ట్విస్ట్ అదిరింది
ప్రేయసిని పర్వతంపైకి తీసుకెళ్లి వదిలేసినా ప్రియుడు.. కట్ చేస్తే
ప్రాణాలు తీసిన ప్రీ వెడ్డింగ్ షూట్.. నవ జంట దుర్మరణం

