Vande Bharat: డిసెంబర్లో కూత పెట్టనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు డిసెంబర్ చివరి నాటికి ఢిల్లీ-పట్నా మార్గంలో సేవలు ప్రారంభించనుంది. 16 కోచ్‌లు, 827 బెర్త్‌లు, 160 కి.మీ/గం వేగంతో ప్రయాణించే ఈ హైటెక్ రైలు, కవచ్ భద్రతా వ్యవస్థతో వస్తుంది. అధునాతన సౌకర్యాలు, హోటల్ లాంటి అనుభూతిని అందిస్తూ, రాత్రిపూట ప్రయాణికులకు లగ్జరీ ప్రయాణాన్ని సురక్షితంగా అందిస్తుంది.
ఎంతగానో ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు కూత పెట్టేందుకు రెడీ అయింది. వందేభారత్ స్లీపర్ రైలు డిసెంబర్ చివరి నాటికి ఢిల్లీ నుంచి పట్నా మార్గంలో సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. 2019లో వందే భారత్ రైలు ప్రారంభమైనప్పటి నుంచి.. ప్రయాణికుల నుంచి బాగా ఆదరణ పొందుతోంది. దీంతో 100 వందే భారత్ రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది. ఈ వందే భారత్ స్లీపర్ రైలు బెంగళూరులోని బీఈఎంఎల్ ఫ్యాక్టరీలో తయారైంది. ట్రయల్ రన్ కోసం డిసెంబర్ 12న నార్తర్న్ రైల్వేకు పంపనున్నారు. ఈ హైటెక్ రైలులో 16 కోచ్‌లు, 827 బెర్త్‌లు ఉంటాయి. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి.. కవచ్ భద్రతా వ్యవస్థతో తయారు చేశారు. రాత్రిపూట సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి హోటల్ లాంటి కంఫర్ట్ అందించనుంది. అత్యాధునిక సౌకర్యాలు, భద్రతపై దృష్టి పెట్టి స్లీపర్ రైలును రూపొందించారు. ఆటోమేటిక్ డోర్లు, బయో టాయిలెట్లు, సీసీటీవీ కెమెరాలు, రీడింగ్ లైట్లు, ప్రీమియం ఇంటీరియర్‌లు ఏర్పాటు చేశారు. గంటకు గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఈ రైలును వారానికి 6 రోజులు నడిచే అవకాశం ఉంది. పట్నాలోని రాజేంద్ర నగర్ టెర్మినల్ నుంచి సాయంత్రం బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం ఢిల్లీ చేరుకోనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!
2025లో గూగుల్‌ను ఊపేసిన టాప్ 10 సినిమాలివే
షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నారో తెలుసా
చైనా అమ్మాయి వెడ్స్ ఝార్ఖండ్ అబ్బాయి.. వీరి అద్భుత ప్రేమ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!
చైనా అమ్మాయి వెడ్స్ ఝార్ఖండ్ అబ్బాయి..
విచిత్ర వివాహం.. శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడిన యువతి
సర్పంచ్ బరిలో అతని ఇద్దరు భార్యలు.. చివరికి ట్విస్ట్ అదిరింది
ప్రేయసిని పర్వతంపైకి తీసుకెళ్లి వదిలేసినా ప్రియుడు.. కట్ చేస్తే
ప్రాణాలు తీసిన ప్రీ వెడ్డింగ్ షూట్.. నవ జంట దుర్మరణం
అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న భీముని రాయి

