విచిత్ర వివాహం.. శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడిన యువతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయు జిల్లాకు చెందిన పింకీ శర్మ తన చిన్ననాటి ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడిని వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులను ఒప్పించి, కృష్ణుడి విగ్రహంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. భక్తి పాటలు పాడుతూ, స్వయంగా కుంకుమ పెట్టుకుని, ఏడడుగులు వేసిన పింకీ శర్మ వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తండ్రి కూడా కుమార్తె నిర్ణయాన్ని సంతోషంగా స్వాగతించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక విచిత్ర వివాహం జరిగింది. చిన్నప్పటి నుంచి ఆరాధించిన దైవాన్నేపెళ్లిచేసుకుంది ఓ మహిళ. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. బాల్యం నుంచి కృష్ణుడిపై ప్రేమను పెంచుకున్న పింకీ శర్మ ఆయననే వివాహం చేసుకోవాలనుకుంది. బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. పింకీ శర్మకు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడంటే అమితమైన భక్తి, ప్రేమ. పెరుగుతున్న కొద్ది ఆయననే ఆరాధిస్తూ ప్రేమను పెంచుకుంది. చివరకి ఆయననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం తల్లిదండ్రులను ఒప్పించి కృష్ణుడి విగ్రహానితో పెళ్లి చేసుకుంది. యూపీలోని బదాయు జిల్లా వాసి పింకీ శర్మ ఇంగ్లిష్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని. పెళ్లి కూతురు భక్తి పాటలను పాడి అందరిలో ఉత్సాహాన్ని నింపింది. సాధారణంగా వివాహాలలో వరుడు.. వధువుకు గంధం రాసి కుంకుమ పెడతాడు. కానీ ఈ పెళ్లిలో పింకీ శర్మ.. కృష్ణుడు పేరున తనకు తానే కుంకుమ పెట్టుకుంది. వివాహానికి గుర్తుగా పింకీ శ్రీకృష్ణుని విగ్రహాన్ని పట్టుకుని ఏడడుగులు వేసింది. వీరి వివాహం తర్వాత బంధువులంతా ఆచార వ్యవహారాల ప్రకారం వధువుకు అప్పగింతల కార్యక్రమం కూడా జరిపారు. కృష్ణుడు విగ్రహంతోనే వధువు ఇంటి నుంచి బయటకొచ్చింది. పింకీ శర్మ వివాహం పట్ల ఆమె తండ్రి ఎంతో సంతోషపడ్డారు. తన కూతురు సరైన నిర్ణయం తీసుకుందని.. ఇప్పుడు శ్రీకృష్ణుడు తన అల్లుడని అన్నారు. బృందావన్‌లోని శ్రీకృష్ణ ఆలయంలో ఓసారి పింకీ చేతుల్లో బంగారు ఉంగరం పడినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇది జరిగి మూడు నెలల అయినట్లు తెలిపారు. అదంతా ఓ మహిమ అనీ ఆ తర్వాతే తన కుమార్తె పెళ్లి నిశ్చయించినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు నార్త్ ఇండియాలో ఇదివరకు కొన్ని చోట్ల జరిగాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సర్పంచ్ బరిలో అతని ఇద్దరు భార్యలు.. చివరికి ట్విస్ట్ అదిరింది
పర్వతంపైకి తీసుకెళ్లి ప్రియురాలిని వదిలేసిన ప్రియుడు.. చలికి గడ్డ కట్టి..
రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ.. కానీ అంతలోనే ఇలా..
విచిత్ర వివాహం.. శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడిన యువతి
సర్పంచ్ బరిలో అతని ఇద్దరు భార్యలు.. చివరికి ట్విస్ట్ అదిరింది
ప్రేయసిని పర్వతంపైకి తీసుకెళ్లి వదిలేసినా ప్రియుడు.. కట్ చేస్తే
ప్రాణాలు తీసిన ప్రీ వెడ్డింగ్ షూట్.. నవ జంట దుర్మరణం
అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న భీముని రాయి
సై అంటే సై అంటున్న అన్నదమ్ములు.. తొడగొడుతున్న తోటికోడళ్లు
సర్పంచ్ కుర్చీ కోసం సతి Vs పతి

