AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పర్వతంపైకి తీసుకెళ్లి ప్రియురాలిని వదిలేసిన ప్రియుడు.. చలికి గడ్డ కట్టి..

పర్వతంపైకి తీసుకెళ్లి ప్రియురాలిని వదిలేసిన ప్రియుడు.. చలికి గడ్డ కట్టి..

Phani CH
|

Updated on: Dec 10, 2025 | 12:29 PM

Share

ఆస్ట్రియాలోని గ్రాస్‌గ్లాక్నర్ పర్వతంపై 33 ఏళ్ల కెర్‌స్టిన్ గర్ట్‌నర్ చలికి గడ్డకట్టి మరణించింది. ఆమె ప్రియుడు, అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడు థామస్ ప్లాంబర్గర్‌పై నిర్లక్ష్యంతో హత్య చేసినట్లు అభియోగాలు మోపారు. ప్రతికూల వాతావరణంలో కెర్‌స్టిన్‌ను ఒంటరిగా వదిలి, సహాయం కోసం ఆలస్యం చేయడమే ఆమె మృతికి కారణమని అధికారులు ఆరోపించారు. ఈ కేసు విచారణ 2026లో జరగనుంది.

పర్వతారోహణ అనేది ఎంతో ప్రమాదకరమైనది. పర్వతారోహణలో ట్రైనింగ్‌ తీసుకున్నవారు మాత్రమే ఎత్తయిన పర్వతాలు ఎక్కే సాహసం చేస్తారు. పర్వతారోహణ సమయంలో ప్రమాదవశాత్తు అనేకమంది చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. ఆస్ట్రియాలో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఆస్ట్రియాలో అత్యంత ఎత్తైన గ్రాస్‌గ్లాక్నర్ పర్వతంపై జరిగిన ఒక విషాద ఘటనలో 33 ఏళ్ల కెర్‌స్టిన్ గర్ట్‌నర్ అనే మహిళ చలికి గడ్డకట్టి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేసారు సంబంధిత అధికారులు. ఆమె మృతికి తీవ్ర నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలపై ఆమె ప్రియుడు, అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడు థామస్ ప్లాంబర్గర్‌ పై అధికారులు హత్య కేసు నమోదు చేశారు. 2025 జనవరిలో కెర్‌స్టిన్, థామస్ ఇద్దరూ గ్రాస్‌గ్లాక్నర్ పర్వతాన్ని అధిరోహించడం ప్రారంభించారు. అనుకున్న సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరడంతో వారు తీవ్ర ప్రతికూల వాతావరణంలో చిక్కుకుపోయారు. మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, పెనుగాలుల ధాటికి కెర్‌స్టిన్ తీవ్రంగా అలసిపోయి, నీరసించిపోయింది. పర్వత శిఖరానికి కేవలం 150 అడుగుల దూరంలో ఉండగా ఇది జరిగింది. ప్రాసిక్యూటర్ల కథనం ప్రకారం.. తెల్లవారుజామున 2 గంటల సమయంలో థామస్ సహాయం కోసం వెళ్తున్నానని చెప్పి కెర్‌స్టిన్‌ను అక్కడే ఒంటరిగా వదిలి వెళ్లాడు. చలి నుంచి రక్షణ కల్పించేందుకు తన వద్ద ఉన్న ఎమర్జెన్సీ దుప్పట్లు లేదా ఇతర సామగ్రిని కూడా ఆమెకు ఇవ్వలేదని వారు ఆరోపించారు. అంతేకాకుండా, సహాయక బృందాలకు సమాచారం ఇవ్వడంలో గంటల తరబడి ఆలస్యం చేయడమే కాకుండా, తొలి కాల్ తర్వాత తన ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టాడని తెలిపారు. తీవ్రమైన గాలుల కారణంగా సహాయక బృందాలు మరుసటి రోజు ఉదయానికి కానీ అక్కడికి చేరుకోలేకపోయాయి. అప్పటికే కెర్‌స్టిన్ మరణించింది. ఈ కేసులో థామస్‌పై తీవ్ర నిర్లక్ష్యంతో హత్యకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. నేరం రుజువైతే అతనికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, ఇది కేవలం ఒక దురదృష్టకర ప్రమాదమని అతని తరఫు న్యాయవాది వాదిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ 2026 ఫిబ్రవరిలో జరగనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ.. కానీ అంతలోనే ఇలా..

ప్రాణాలు తీసిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. నవ జంట దుర్మరణం

TOP 9 ET News: ఖండ-2 రిలీజ్ డేట్ ఫిక్స్? గెట్ రెడీ

Rajasekhar: రాజశేఖర్‌కు షూటింగ్ లో ప్రమాదం.. డి కాలికి తీవ్ర గాయం

దివ్వెల మాధురిపై రీతూ తల్లి సెటైర్లు.. అబద్దాలు ఆడితే ఇలానే ఉంటది