భర్త చనిపోయినా.. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం
మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో షబ్నం మన్సూరీ ఐవీఎఫ్ ద్వారా నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. భర్త మరణానంతరం ఆమె ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పసికందులు ఐసీయూలో ఉన్నప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారు. ఇది తల్లి ధైర్యానికి, ఐవీఎఫ్ పద్ధతి విజయానికి ప్రతీక. ఈ కథ సమాజానికి స్ఫూర్తిదాయకం.
మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మ నిచ్చింది. ప్రస్తుతం ఆ నలుగురు పసికందులు ఆరోగ్యంగానే ఉన్నారని సహజంగా ఉండాల్సినదాని కంటే తక్కువ బరువు ఉండడంతో వారిని ఐసీయూలో ఉంచామని వైద్యులు తెలిపారు. వాస్తవానికి 7 నెలల క్రితమే షబ్నం మన్సూరీ భర్త సయ్యద్ మన్సూరి ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇది ఆమె జీవితంలో చాలా బాధాకరమైన విషయం. కానీ అంతకు ముందే ఆ జంట ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతిలో చికిత్స తీసుకుంది. అంటే ఆమె భర్త వీర్యకణాలను కృత్రిమంగా ఆమెలో ప్రవేశపెట్టారు. దీని ఫలితంగా ఆమెకు గర్భం వచ్చింది. కానీ ఈ శుభవార్త వినకుండానే ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అయినా ఆ బాధను దిగమించి, ఆమె బిడ్డలకు జన్మనివ్వాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు నలుగురు బిడ్డలకు తల్లి అయ్యింది. ‘ఐవీఎఫ్ విధానంలో గర్భధారణకు చాలా ఎక్కువ అవకాశం ఉంది. అయితే అది ఎంతో జాగ్రత్తగా, మంచి నైపుణ్యంతో చేయాల్సి ఉంటుంది. షబ్నం విషయంలో అంతా మంచే జరిగింది. ఇది ఆ మహిళ ధైర్యం, బలమైన మాతృత్వ భావనకు ప్రతీక. క్లిష్టపరిస్థితుల్లోనూ ఆమె ధైర్యంగా ముందుకెళ్లడం సమాజానికి స్ఫూర్తిదాయకం’ అని డాక్టర్ ఫర్హత్ అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రైవర్ కు ఫిట్స్ .. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు..
ఆధార్‌పై కీలక అప్‌డేట్.. దాని కోసం QR కోడ్ తప్పని సరి
Vande Bharat: డిసెంబర్లో కూత పెట్టనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు
బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!
భర్త చనిపోయినా.. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం
డ్రైవర్ కు ఫిట్స్ .. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు..
బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!
చైనా అమ్మాయి వెడ్స్ ఝార్ఖండ్ అబ్బాయి..
విచిత్ర వివాహం.. శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడిన యువతి
సర్పంచ్ బరిలో అతని ఇద్దరు భార్యలు.. చివరికి ట్విస్ట్ అదిరింది
ప్రేయసిని పర్వతంపైకి తీసుకెళ్లి వదిలేసినా ప్రియుడు.. కట్ చేస్తే

