AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPLకు పోటీగా పాకిస్తాన్ కన్నింగ్ ప్లాన్.. కట్‌చేస్తే.. PSL ప్రారంభానికి ముందే బిగ్ ట్రబుల్..!

Pakistan Super League: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 ఈసారి ఐపీఎల్‌కు నేరుగా పోటీగా నిర్వహించడానికి సిద్ధమైంది. అయితే లీగ్ ప్రారంభానికి ముందే పాకిస్తాన్‌లో పెరిగిన ఇంధన సంక్షోభం వల్ల షెడ్యూల్ మారే ప్రమాదం ఏర్పడింది. దీంతో పీసీబీ ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది.

IPLకు పోటీగా పాకిస్తాన్ కన్నింగ్ ప్లాన్.. కట్‌చేస్తే.. PSL ప్రారంభానికి ముందే బిగ్ ట్రబుల్..!
Ipl Vs Psl
Venkata Chari
|

Updated on: Mar 10, 2026 | 1:10 PM

Share

పాకిస్తాన్ సూపర్ లీగ్ (Pakistan Super League) పీఎస్ఎల్ 2026 ఈసారి ప్రపంచ క్రికెట్‌లో భారీ చర్చకు దారితీసింది. కారణం, అదే సమయంలో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League( (IPL) తో నేరుగా పోటీ పడటమే. ఐపీఎల్ 2026 మార్చి 28న ప్రారంభం కానుండగా, PSL కూడా మార్చి 26 నుంచి మొదలయ్యేలా ప్లాన్ చేశారు. దీంతో రెండు ప్రముఖ టీ20 లీగ్‌లు ఒకే సమయంలో జరగనున్నాయి. అయితే లీగ్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్‌కు పెద్ద సమస్య ఎదురైంది.

ఇంధన సంక్షోభం ప్రభావం..

పాకిస్తాన్‌లో పెరుగుతున్న చమురు ధరల నేపథ్యంలో ప్రభుత్వం ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పంజాజ్ (Punjab), పాకిస్తాన్ (Pakistan) లో అన్ని స్కూల్స్, కాలేజీలు, విశ్వవిద్యాలయాలను మార్చి 31 వరకు మూసివేయాలని నిర్ణయించారు.

అదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయాలు దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్నారు.

PSL షెడ్యూల్‌పై ప్రభావం..

ఈ పరిస్థితులు PSL 2026 నిర్వహణపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ లీగ్ మ్యాచ్‌లు ప్రధానంగా పాకిస్తాన్‌లోని పలు నగరాల్లో జరగనున్నాయి. లాహోర్ (Lahore), కరాచీ (Karachi), రావల్పిండి (Rawalpindi), ముల్తాన్ (Multan) ఈ నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంది. కానీ స్కూల్స్, కాలేజీలు మూసివేయడం వల్ల స్టేడియాల్లో ప్రేక్షకుల రాక, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని పాకిస్తాన్ మీడియా నివేదికలు చెబుతున్నాయి.

దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (Pakistan Cricket Board) పీఎస్ఎల్ షెడ్యూల్‌ను మార్చే అవకాశముందని సమాచారం. అయితే ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

PSL 2026 షెడ్యూల్ ఎలా ఉండొచ్చు?

ప్రస్తుతం లభించిన సమాచారం ప్రకారం PSL 11వ సీజన్ మార్చి 26 నుంచి మే 3 వరకు కొనసాగవచ్చు.

ప్రారంభ మ్యాచ్‌లో ప్రస్తుత ఛాంపియన్ Lahore Qalandars లాహోర్‌లోని Gaddafi Stadium లో కొత్త జట్టు Hyderabad Houston Kingsmen తో తలపడనుంది.

మొదటి దశలో ప్రతి జట్టు 7 మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత టాప్ 6 జట్లు రెండో రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. చివరగా ప్లే ఆఫ్స్ నిర్వహించి మే 3న లాహోర్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us