AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఫస్ట్ నైట్ కోసం ఆశగా ఎదురు చూసిన వధువు.. వరుడిచ్చిన షాక్‌తో దెబ్బకు కళ్లు తేలేసిందిగా

ఇంజనీర్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల యువకుడితో బేలియాపర్‌కు చెందిన యువతికి నవంబర్ 28న వివాహం జరిగింది. మరుసటి రోజు అప్పగింతల కార్యక్రమం అనంతరం వధువు అత్తవారింటికి వచ్చింది. అయితే, శోభనం రోజు రాత్రి ఆమె భర్త..తాను శారీరకంగా బలహీనుడనని, దాంపత్య సుఖం ఇవ్వలేనని..

Viral: ఫస్ట్ నైట్ కోసం ఆశగా ఎదురు చూసిన వధువు.. వరుడిచ్చిన షాక్‌తో దెబ్బకు కళ్లు తేలేసిందిగా
Viral
Ravi Kiran
|

Updated on: Dec 11, 2025 | 1:28 PM

Share

కోటి ఆశలతో వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపాలని కలలుకన్న యువతి పెళ్లి చేసుకొని భర్తతో కలిసి అత్తవారింట్లో అడుగు పెట్టింది. మొదటి రాత్రే ఆ నవ వధువు ఆశలు అడియాలు చేస్తూ చేదు అనుభవం ఎదురైంది. దాంపత్య జీవితానికి తన భర్త పనికిరాడని తెలిసి నిర్ఘాంతపోయింది. చేసేది లేక పెళ్లయిన మూడోరోజే తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గోరఖ్‌పూర్‌ పారిశ్రామిక అభివృద్ధి ప్రాధికార సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల యువకుడితో బేలియాపర్‌కు చెందిన యువతికి నవంబర్ 28న వివాహం జరిగింది. మరుసటి రోజు అప్పగింతల కార్యక్రమం అనంతరం వధువు అత్తవారింటికి వచ్చింది. అయితే, శోభనం రోజు రాత్రి ఆమె భర్త..తాను శారీరకంగా బలహీనుడనని, దాంపత్య సుఖం ఇవ్వలేనని స్వయంగా చెప్పడంతో వధువు దిగ్భ్రాంతికి గురైంది. దాంపత్య జీవితానికి పనికిరాని వ్యక్తితో తన జీవితాన్ని పంచుకోలేను అని ఆమె తన లీగల్ నోటీసులో పేర్కొంటూ కుటుంబంతో కలిసి పోలీసులను ఆశ్రయించింది.

డిసెంబర్ 1న ఓ సంప్రదాయం ప్రకారం కూతురిని చూడటానికి వచ్చిన తండ్రికి ఆమె ఈ విషయం చెప్పడంతో, ఆయన వెంటనే ఆమెను పుట్టింటికి తీసుకెళ్లారు. అనంతరం ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి. వరుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అతను తండ్రి కాలేడని తేలినట్లు వధువు కుటుంబ సభ్యులు తెలిపారు. రెండేళ్ల క్రితం కూడా అతనికి ఇదే కారణంతో పెళ్లైన నెలకే విడాకులు అయ్యాయని వారు ఆరోపించారు. విషయం పోలీస్‌ స్టేషన్‌కి చేరడంతో పోలీసుల జోక్యంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. పెళ్లి ఖర్చుల కింద రూ.7 లక్షలతో పాటు, ఇచ్చిన కానుకలన్నీ నెల రోజుల్లోగా తిరిగి ఇచ్చేందుకు వరుడి కుటుంబం అంగీకరించింది. ఈ మేరకు బంధువుల సమక్షంలో ఒప్పందం కుదిరిందని, సమస్య సామరస్యంగా పరిష్కారమవుతోందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
ఊర మాస్ అంటే ఇదీ.. యూట్యూబ్‏లో సెన్సేషన్.. పక్కా లోకల్ వైబ్..
ఊర మాస్ అంటే ఇదీ.. యూట్యూబ్‏లో సెన్సేషన్.. పక్కా లోకల్ వైబ్..
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో సంచలనం సృష్టించిన కెనడా యువకుడు.. ఎవరంటే
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో సంచలనం సృష్టించిన కెనడా యువకుడు.. ఎవరంటే
నేను ముందే చెప్పా.. టీమిండియాను ఓడించాలంటే కచ్చితంగా ఆ దేవుడే..
నేను ముందే చెప్పా.. టీమిండియాను ఓడించాలంటే కచ్చితంగా ఆ దేవుడే..
ఇల్లంతకుంటలో పెద్దపులి దాడి…నాలుగు ఆవులు మృతి..గ్రామంలో భయాందోళన
ఇల్లంతకుంటలో పెద్దపులి దాడి…నాలుగు ఆవులు మృతి..గ్రామంలో భయాందోళన
శివరాత్రి వేళ స్మశానంలో మంత్రి.. ఏంచేశారో తెలుసా ??
శివరాత్రి వేళ స్మశానంలో మంత్రి.. ఏంచేశారో తెలుసా ??
'ఆ రోజుల్లో డైరెక్టర్ వినాయక్ అనగానే.. ఆయనెవరు అన్నా.?'
'ఆ రోజుల్లో డైరెక్టర్ వినాయక్ అనగానే.. ఆయనెవరు అన్నా.?'
లక్ష్మణుడు లేని అరుదైన శ్రీరామ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా
లక్ష్మణుడు లేని అరుదైన శ్రీరామ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా
ఏపీ ప్రభుత్వం సూపర్ ప్లాన్.. ఈ జిల్లాల్లో కొత్త ఎయిర్‌పోర్ట్‌లు
ఏపీ ప్రభుత్వం సూపర్ ప్లాన్.. ఈ జిల్లాల్లో కొత్త ఎయిర్‌పోర్ట్‌లు
శరీరంలో ఏ అవయవం ఎక్కువగా పనిచేస్తుందో తెలుసా..?
శరీరంలో ఏ అవయవం ఎక్కువగా పనిచేస్తుందో తెలుసా..?
రాజస్థాన్ రాయల్స్‌లో చేరనున్న గౌతమ్ గంభీర్..
రాజస్థాన్ రాయల్స్‌లో చేరనున్న గౌతమ్ గంభీర్..