AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏది పెట్టినా తినట్లేదు.. కంగారొచ్చి ఆవుకు ఎక్స్‌రే తీయగా.. కడుపులో కిలోల కొద్ది

అవసరమైతే ఇతర పశువులకు విడతల వారీగా సర్జరీలు నిర్వహించాలని స్థానికులు, జంతు ప్రేమికులు వైద్యులను కోరుతున్నారు. సిటీలలో నిర్వీర్యంగా వదిలేసిన ఆవులు, ఎద్దులు రోడ్లపై తిరగడం పెరిగిపోతున్న నేపథ్యంలో వాహనదారులు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మధ్యలో పశువులు పడుకోవడం.. ఆ వివరాలు ఇలా..

Andhra: ఏది పెట్టినా తినట్లేదు.. కంగారొచ్చి ఆవుకు ఎక్స్‌రే తీయగా.. కడుపులో కిలోల కొద్ది
Andhra News
M Sivakumar
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 11, 2025 | 1:12 PM

Share

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రోడ్లపై తిరిగే పశువుల సమస్య మరో కొత్త మలుపు తీసుకుంది. ఓ ఆవు తీవ్ర అస్వస్థతతో కనిపించడంతో వెటర్నరీ శాఖ అధికారుల దృష్టికి వెళ్ళింది. డాక్టర్ పర్యవేక్షణలో వెటర్నరీ వైద్యులు దీపక్, హేమంత్ బృందం ఆవుకు అత్యవసర చికిత్స నిర్వహించారు. మూడు గంటల పాటు సాగిన ఆపరేషన్‌లో ఆవు కడుపులో పేరుకుపోయిన 52 కిలోల ప్లాస్టిక్, భారీ చెత్త వ్యర్ధాలు బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడుతోంది. నగరాల్లో అనేక ఆవులు మేత దొరక్క చెత్త కుప్పలలో ఆహారం కోసం వెతుకుతూ ప్లాస్టిక్ పోస్టర్లు, కవర్లు మింగడం వల్ల తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి కేసులు మరిన్ని నమోదు అవుతున్నాయి.

అవసరమైతే ఇతర పశువులకు విడతల వారీగా సర్జరీలు నిర్వహించాలని స్థానికులు, జంతు ప్రేమికులు వైద్యులను కోరుతున్నారు. సిటీలలో నిర్వీర్యంగా వదిలేసిన ఆవులు, ఎద్దులు రోడ్లపై తిరగడం పెరిగిపోతున్న నేపథ్యంలో వాహనదారులు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మధ్యలో పశువులు పడుకోవడం.. ఒక్కసారిగా రోడ్డుపైకి రావడం వల్ల ప్రమాదాలు జరిగి పలువురు గాయపడిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి. పశువర్ధక శాఖ మున్సిపల్ అధికారుల సమన్వయం చేసుకుని రోడ్లపై తిరిగే పశువుల సంరక్షణ చికిత్స, ప్లాస్టిక్ వ్యర్ధాల నియంత్రణలో దృష్టి పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చేయండి