Schools Closes: అక్కడ సంచలన నిర్ణయం.. మార్చి 31 వరకు విద్యాసంస్థలు బంద్.. వారానికి 4 రోజులే పని!
Schools Closes: ప్రభుత్వ యాజమాన్యంలోని పిటివి, ఇతర ప్రైవేట్ ఛానెళ్లలో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన పిఎం షరీఫ్.. "ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని 50 శాతం ఉద్యోగులు ఇంటి నుండే పని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది" అని అన్నారు. అన్ని అధికారిక బహిరంగ..

Schools Closes: మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న ఘర్షణల ప్రభావం పాకిస్తాన్‌పై గట్టిగానే కనిపిస్తోంది. చమురు సంక్షోభం తీవ్రంగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాక్‌లో మార్చి 31 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను మూసివేయాలని ఆదేశించింది. పశ్చిమాసియా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇంధనాన్ని ఆదా చేసే ప్రయత్నంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటి నుండి పని చేసే విధానాన్ని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ప్రవేశపెట్టారు. గత కొన్ని రోజులుగా గల్ఫ్ నుండి చమురు సరఫరాలపై దేశం ఆధారపడటాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మార్చి 9న నాలుగు రోజుల పని వారాన్ని ప్రకటించారు.
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మార్చి 10 నుండి మార్చి 31 వరకు మూసివేయనున్నారు. పరీక్షలు ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారు. ఈ కాలంలో విద్యాసంస్థలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడానికి అనుమతించినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ సోమవారం ప్రకటించారు.
ఇది కూడా చదవండి: LPG Gas: హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల కొరత.. గృహ అవసరాలకు తప్పని తిప్పలు.. డిస్ట్రిబ్యూటర్స్ ఏమంటున్నారంటే..
ప్రభుత్వ యాజమాన్యంలోని పిటివి, ఇతర ప్రైవేట్ ఛానెళ్లలో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన పిఎం షరీఫ్, “ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని 50 శాతం ఉద్యోగులు ఇంటి నుండే పని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది” అని అన్నారు. వారు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేస్తారని అన్నారు.
ప్రభుత్వ యాజమాన్యంలోని పిటివి, ఇతర ప్రైవేట్ ఛానెళ్లలో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన పిఎం షరీఫ్.. “ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని 50 శాతం ఉద్యోగులు ఇంటి నుండే పని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది” అని అన్నారు. అన్ని అధికారిక బహిరంగ కార్యక్రమాలను కూడా నిషేధించారు. పెట్రోల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను నిల్వల కోసం కొనుగోలు చేయడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నందున కొన్ని కార్యక్రమాలను కూడా నిషేధించారు. ప్రభుత్వ వాహనాలకు ఇంధన కేటాయింపును రాబోయే రెండు నెలల పాటు 50 శాతం తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ కాలంలో 60 శాతం వాహనాలు పనిచేయడం మానేస్తాయని షరీఫ్ తెలిపారు.
భారతదేశంలో కూడా ఈ పరిస్థితి వస్తుందా?
పాక్ లాగానే భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందా? అని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇంధన కొరత క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి. పెట్రోలియం , సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల భారతదేశంలో ఇంధన కొరత లేదని, ఇంధన వినియోగదారులు ఆందోళన చెందవద్దని తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




