Viral: మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది.. 10 నిమిషాల్లోనే.!
టైటిల్ చూసి కాస్త షాక్ అయ్యి ఉంటారు. కానీ ఇది నిజం అండీ.! మగాళ్లకే కాదు మహిళలకు కూడా వయాగ్రా వచ్చేసింది. ఇది మన ఇండియాలో కాదులెండి.! అమెరికాలో లాంచ్ చేశారు. మరి అదేంటో ఈ స్టోరీలో తెలుసుకోండి.. ఆ వివరాలు ఇలా..

పురుషులు లైంగిక ఆరోగ్యం కోసం సుమారు మూడు దశాబ్దాల క్రితం చిన్న టాబ్లెట్ అయిన వయాగ్రాను కనుగొన్నారు. ఇక ఇప్పుడు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో మరో ముందడుగు వేసి.. మహిళలకు కూడా ఇలాంటి ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేశారు. అమెరికాకు చెందిన హెల్త్ బయోటెక్ గ్రూప్ డేర్ బయోసైన్స్ కేవలం 10 నిమిషాల్లో పనిచేసే వయాగ్రా క్రీమ్‌ను కనిపెట్టారు. ఇది మహిళలకు లైంగిక శక్తీని పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని.. దీని ధర 10 డాలర్లు మాత్రమేనని ఆ సంస్థ స్పష్టం చేసింది.
ఈ క్రీమ్‌లో పురుషుల వయాగ్రాలో ఉపయోగించే సిల్డెనాఫిల్ అనే ఫాస్ఫో డయస్టరేస్-5 నిరోధక రసాయనాన్ని వినియోగించారు. దీనిని ఎలా ఉపయోగించాలన్న దానిపై కూడా సంస్థ వివరించింది. 1998లో పురుషుల లైంగిక ఆరోగ్యం కోసం వయాగ్రా టాబ్లెట్లను అందుబాటులోకి తీసుకురాగా.. ఇప్పుడు దాదాపుగా 30 ఏళ్లు తర్వాత మహిళల లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఈ క్రీమ్‌పై క్లినికల్ ట్రయిల్స్ కూడా నిర్వహించారు. సుమారు 200 మంది మహిళలపై జరిపిన ఈ ట్రయిల్స్‌లో క్రీమ్ పనితీరుపై అత్యంత సానుకూల ఫలితాలు నమోదయ్యాయి. ట్రయల్స్‌లో పాల్గొన్న మహిళల్లో లైంగిక ఆసక్తి, కోరికలు లాంటివి గణనీయంగా పెరిగినట్లు తేలింది. ఈ క్రీమ్‌లో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని సంస్థ వెల్లడించింది.
పురుషులకు పిల్ రూపంలో సిల్డెనాఫిల్ అందుబాటులో ఉన్నప్పుడు మహిళలకు పిల్స్ ఎందుకు తయారు చేయలేదన్న ప్రశ్నకు ఆ సంస్థ సీఈఓ జాన్సన్ వివరణ ఇచ్చారు. మహిళల్లో సిల్డెనాఫిల్ పిల్ ప్రభావం చూపించాలంటే చాలా ఎక్కువ మోతాదు అవసరమవుతుంది. అంత మోతాదు మనిషి శరీరంపై తీవ్రమైన ప్రభావాలు చూపిస్తుంది. అందుకే క్రీమ్ రూపంలో తక్కువ మోతాదులోనే మెరుగైన ఫలితాలు పొందొచ్చునని ఆమె తెలిపారు. డేర్ బయోసైన్స్ ప్రస్తుతం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) అనుమతుల కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం అమెరికాలోని 10 రాష్ట్రాల్లో ఈ క్రీమ్ కోసం ప్రీ-ఆర్డర్లు స్వీకరిస్తోంది. 2026 ప్రారంభం నాటికి అమెరికా అంతటా ఈ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




