రోడ్డుపై వెళ్లేప్పుడు కుక్కలు వెంటపడుతున్నాయా? టెన్షనొద్దు.. సింపుల్‌గా ఇలా తప్పించుకోండి!
ఈ మధ్య కాలంలో వీధి కుక్కల బెడద పెరిగిపోయింది. జనాలు వాటి ముందు నుంచి వెళ్లడమే పాపమైపోయింది. బైక్‌పై కాస్తా స్పీడ్‌గా వెళ్లామంటే చాలా.. వెంబడించి.. వారిని కిందపడేసే వరకు వదలవు.. అలా కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో జనాలు కుక్కలను చూస్తేనే బెదిరిపోతున్నారు. అందుకే వీధి కుక్కలు మీ వెంటపడితే మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో మేం చెప్పబోతున్నాం. కుక్కలు వెంబడించినప్పుడు ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలా.. మీరు ఈజీగా వాటి నుంచి తప్పించుకోవచ్చు

ఈ మధ్య కాంలో వీధికుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది. కంటపడితే చాలా అవి మీదపడి రక్కేస్తున్నాయి. ఇక చిన్న పిల్లులు ఒంటరిగా కనిస్తే అదో పెద్ద పాపం. రక్తం మరిగిన సింహాళ్లా వారిపై పడి పీక్కుతింటున్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కొన్ని వందల ఘటనలు ఇటీవల కాలంలో వెలుగు చూశాయి. ఈ కుక్కల దాడుల్లో దేశవ్యాప్తంగా ఏడాదికి సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఎక్కడైనా కుక్కల గుంపు కనిపించా, అవి వెంటపడినా జనాలు భయపడిపోతారు. గట్టిగా అరవడమో, పరిగెత్తడమో చేస్తారు. కానీ కొన్నిసార్లు ఈ పనులే మనకు ప్రమాద తీవ్రతను పెంచుతాయి. కాబట్టి వీధికుక్కలు వెంటపడినా, లేదా అవి మిమ్మల్ని చుట్టుముట్టినా.. వాటిని నుంచి ఎలా తప్పించుకోవాలో మనకు తెలిసి ఉండాలి.
వీధికుక్కల వెంటపడినప్పుడు ఎలా తప్పించుకోవాలి?
మీరు బైక్‌పై లేదా, నడుచుకుంటూ ఒంటరిగా వెళ్తున్నప్పుడు వీధి కుక్కలు మీ వెంటపడితే.. మీరు పరిగెత్తకండి. బైక్‌పై స్పీడ్‌గా వెళ్లకండి. ఇలా చేయడం ద్వారా మీరు కంగారులో కిందపడి వాటికి ఈజీగా దొరికిపోవచ్చు, లేదా మీరు గాయపడవచ్చు. బదులుగా మీరు అక్కడే బలంగా నిల్చొని.. వాటని కాకుండా వేరే సైడ్ దృష్టి పెట్టండి.. ఒక వేళ అవి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని వాసన చూస్తుంటే భయపడకండి.. అది మీ వాసన పసిగట్టకుండా జాగ్రత్త పడండి. అప్పుడు కుక్క మిమ్మల్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
వాటి కళ్లలోకి నేరుగా చూడకండి
ఒక వేళ మీరు అనుకోకుండా కుక్కల మధ్యలో చిక్కినా, అవి మీకు ఎదురుపడినా.. పొరపాటున కూడా వాటి కళ్లలోకి నేరుగా చూడకండి. అలా చూస్తే అవి మరింత దూకుడుగా భావించి.. మీపై దాడి చేసే అవకాశం ఉంటుంది. అది మీపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే.. మీ దగ్గర ఆయుధం లేకుండా దానిపైకి వెళ్లకండి.. అలా చేస్తే అది మిమ్మల్ని శత్రువులుగా భావించి మరింత అగ్రెసీవ్‌గా దాడికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఆ టైంలో నెమ్మదిగా దానికి దూరంగా జరగడానికి ప్రయత్నించండి. అప్పుడు అది శాంతిస్తుంది.
కుక్కలు కనిపిస్తే పరిగెత్తకండి
చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే.. కుక్కలు కనిపించిన వెంటనే పరిగెడతారు. అలా చేస్తే అవి కచ్చితంగా మిమ్మల్ని వెంబడిస్తాయి. కాబట్టి మీరు వాటి నుంచి తప్పించుకోవాలంటే.. నెమ్మదిగా అక్కడి నుంచి కదలండి. ముఖ్యంగా మీరు బైక్‌పై వెళ్లేప్పుడు కుక్కలు మిమ్మల్ని వెంబడిస్తే.. బైక్‌ను స్పీడ్‌గా తోలకుండా వెంటనే ఆపండి. లేదంటే మీరు ప్రమాదాల భారీనా పడవచ్చు.
గట్టిగా అరవకండి
కుక్కలు కనిపిస్తే చాలా భయపడిపోయి చాలా మంది గట్టి గట్టిగా అరుస్తుంటారు. ఇలా చేయడం చాలా తప్పు. కుక్కలకు అరవడం చాలా కోపాన్ని తెప్పిస్తుంది. కుక్కలు వెంబడించినప్పుడు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. అవి మీపై వస్తే.. మెళ్లగా పక్కకు జరగండి. అప్పుడు అవి కాస్త శాంతిస్తాయి.
గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన మేరకు మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
