Team India: ఆ షాట్స్ ఏంటి సామీ.! అప్పుడేమో జట్టుకు ఆపద్బాంధవుడిలా.. ఇప్పుడేమో గుడ్డి ఊపుడు స్టార్‌గా
టీ20 ప్రపంచకప్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఫామ్‌పై టీం మేనేజ్‌మెంట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత 20 ఇన్నింగ్స్‌లలో అతడు చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. యావరేజ్ 13.35గా ఉంది. ముల్లాన్‌పూర్ మ్యాచ్‌లోనూ నిరాశపరిచిన సూర్యకుమార్ పేలవమైన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఆ వివరాలు ఇలా..

టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. నవంబర్ 2024 నుంచి అతడి బ్యాట్ నుంచి మంచి ఇన్నింగ్స్ రాలేదు. గత 20 టీ20 ఇన్నింగ్స్‌లలో సూర్యకుమార్ యాదవ్ కేవలం 227 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 13.35గా, స్ట్రైక్ రేట్ 120.10గా ఉంది. ఇందులో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. అలాగే స్కై బ్యాటింగ్ ఆర్డర్‌పై కూడా ఓ క్లారిటీ లేదు. ఇటీవల ముల్లాన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు బంతుల్లో కేవలం ఐదు పరుగులు చేసి మార్కో యాన్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గత 20 ఇన్నింగ్స్‌లలో అతడు 20కి పైగా బంతులను ఎదుర్కొన్న సందర్భాలు కేవలం రెండు మాత్రమే.
టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు గత 21 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మ్యాచ్‌లలో మాత్రమే ఓడిపోయింది. అయితే ఆ జట్టు కెప్టెన్ మాత్రం ఫ్లాప్ అవుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్‌తో పాటు ఇతర బ్యాటర్లు రాణించలేకపోయారు. కేవలం తిలక్ వర్మ మాత్రమే మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మరో రెండు నెలలో టీ20 ప్రపంచకప్ ఉండగా.. సూర్యకుమార్ యాదవ్ మళ్లీ తిరిగి ఫామ్‌లోకి రావాలని టీం మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. ఒకప్పుడు గ్రౌండ్‌కు 360 డిగ్రీలలో షాట్లు ఆడే స్కై.. ఇప్పుడు కనీసం 20 బంతులు ఎదుర్కోవడానికి కూడా కష్టపడుతున్నాడు. నవంబర్ 2024 నుంచి 17 సార్లు పేస్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరడం.. అతడి బలహీనతను ఎత్తి చూపుతోంది. క్రీజ్‌లో సెటిల్ అవ్వకముందే భారీ షాట్ల కోసం తొందరపడటం, రిస్కీ షాట్లు ఆడటం వల్ల త్వరగా ఔటవుతున్నాడు. ఫామ్‌లో లేనప్పుడు ఆరంభంలో ఆచితూచి ఆడాలని, అయితే సూర్యకుమార్ మాత్రం ఫియర్ లెస్ క్రికెట్ పేరుతో వచ్చీరాగానే ఎటాక్ చేయాలనుకుంటున్నాడు. ఇది అస్సలు వర్క్ అవుట్ కావట్లేదు. గత ఐపీఎల్ సీజన్‌లో మాత్రం సుర్యకుమార్ అద్భుతంగా రాణించాడు. 16 ఇన్నింగ్స్‌లలో 65.15 సగటుతో 717 పరుగులు చేసి, స్ట్రైక్ రేట్ 167.91తో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ చూడండి








