AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yashasvi Jaiswal: ఆయన అలా తిడితేనే మాకు హ్యాపీ

Yashasvi Jaiswal: ఆయన అలా తిడితేనే మాకు హ్యాపీ

Phani CH
|

Updated on: Dec 13, 2025 | 1:05 PM

Share

రోహిత్ శర్మ తిట్లలో కోపం కంటే ప్రేమే ఎక్కువని యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన కోప్పడకపోతేనే తాము కంగారుపడతామని నవ్వాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్, విరాట్ వంటి సీనియర్ల నుండి లభించే స్ఫూర్తి, అనుభవాలు తమకు ఎంతో విలువైనవిగా అభివర్ణించాడు. టీ20 ప్రపంచకప్ ఆడాలనే కల, భవిష్యత్తులో భారత జట్టు కెప్టెన్సీ వహించాలనే తన ఆకాంక్షను కూడా వెల్లడించాడు.

మైదానంలో రోహిత్ శర్మ తన జూనియర్లపై అరిచినప్పుడు అందులో కోపం కంటే ప్రేమే ఎక్కువగా ఉంటుందని, ఒకవేళ ఆయన తిట్టకపోతేనే తమకు కంగారుగా ఉంటుందని టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ తిట్లలో ఎంతో ఆప్యాయత దాగి ఉంటుందని, అది తమకు ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డాడు. బుధవారం జరిగిన ‘అజెండా ఆజ్ తక్’ సదస్సులో పాల్గొన్న జైస్వాల్ … “రోహిత్ భాయ్ మమ్మల్ని తిట్టిన ప్రతిసారీ అందులో చాలా ప్రేమ ఉంటుంది. నిజానికి ఆయన మమ్మల్ని తిట్టడం ఆపేస్తే… ‘ఏమైంది? ఎందుకు తిట్టడం లేదు? నేను చేసిన పనికి ఆయన బాధపడ్డారా?’ అని మాకు ఆందోళనగా ఉంటుంది” అని నవ్వుతూ చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు ఉండటం తమలాంటి యువకులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని జైస్వాల్ తెలిపాడు. వారు తమ అనుభవాలను తమతో పంచుకుంటారని, ఆట గురించి చర్చిస్తారని తెలిపాడు. గతంలో వారు చేసిన పొరపాట్లను తాము చేయకుండా ఎలా ఆడాలో సలహాలిస్తారని వెల్లడించాడు. వాళ్లు జట్టులో లేనప్పుడు తాము వారిని చాలా మిస్ అవుతాం అని తెలిపాడు. తన తొలి వన్డే సెంచరీ నాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ.. జైస్వాల్‌… ఆ మ్యాచ్‌లో రోహిత్ భాయ్ నన్ను ప్రశాంతంగా, కాస్త సమయం తీసుకుని ఆడమన్నారు. రిస్క్ తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అలాగే విరాట్ పాజీ చిన్న చిన్న లక్ష్యాలు నిర్దేశిస్తూ మమ్మల్ని గెలిపించాలని ప్రోత్సహించారు” అని అన్నాడు. భవిష్యత్తులో టీ20 ప్రపంచకప్ ఆడాలన్నది తన కల అని, అవకాశం వస్తే భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని జైస్వాల్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు

భారత శాస్త్రవేత్తల అద్భుత సృష్టి.. జన్యు సమస్యల కోసం కొత్త ప్రొటీన్‌

టారిఫ్ ధరలు పెంచేసిన ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్

విహారయాత్రకు వెళ్ళొచ్చి.. ఇంటి గడియ తీసుంచి.. ఏంటా అని చూడగా..

ఒక్క వ్యక్తి జన్యువులో లోపం.. 200 మంది పిల్లలకు శాపం