AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క వ్యక్తి జన్యువులో లోపం..  200 మంది పిల్లలకు శాపం

ఒక్క వ్యక్తి జన్యువులో లోపం.. 200 మంది పిల్లలకు శాపం

Phani CH
|

Updated on: Dec 13, 2025 | 12:08 PM

Share

ఓ వీర్యదాతలో TP53 జన్యులోపం వల్ల కలిగే లీ-ఫ్రామినీ సిండ్రోమ్ 200 మంది చిన్నారుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసింది. ఈ క్యాన్సర్ కారక లోపాన్ని గుర్తించకుండా 17 ఏళ్లు వీర్యాన్ని ఉపయోగించడంతో యూరోప్‌లో కొందరు పిల్లలు ఇప్పటికే క్యాన్సర్‌తో మరణించారు. ఈ ఘటన వీర్యదాత స్క్రీనింగ్, సంతాన సాఫల్య కేంద్రాల నియమాలలో ఉన్న లోపాలను వెలుగులోకి తెచ్చింది, తక్షణ సంస్కరణల ఆవశ్యకతను నొక్కి చెబుతోంది.

ఓ వీర్యదాత కారణంగా 200 మంది చిన్నారుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. క్యాన్సర్‌కు కారణమయ్యే ఓ ప్రమాదకరమైన జన్యు లోపం ఉన్న వ్యక్తి నుంచి సేకరించిన వీర్యాన్ని ఉపయోగించడంతో యూరోప్‌ అంతటా కలకలం రేగింది. ఈ వీర్యంతో గర్భం దాల్చిన వారిలో కొందరు చిన్నారులు ఇప్పటికే క్యాన్సర్ బారిన పడి మరణించినట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. డెన్మార్క్‌కు చెందిన ఓ వ్యక్తి వీర్యంలో TP53 అనే జన్యువులో లోపం ఉంది. ఈ లోపం వల్ల పుట్టే పిల్లలకు ‘లీ-ఫ్రామినీ సిండ్రోమ్’ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి వస్తుంది. దీనివల్ల 60 ఏళ్లు వచ్చేసరికి క్యాన్సర్ బారిన పడే ప్రమాదం 90 శాతం వరకు ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్లు, ఎముకల క్యాన్సర్ వంటివి వీరిలో ఎక్కువగా కనిపిస్తాయి. 2005లో ఓ వ్యక్తి వీర్యదానం చేయగా, అతడి నమూనాలను 17 ఏళ్ల పాటు వివిధ సంతాన సాఫల్య కేంద్రాలు ఉపయోగించాయి. ఆ సమయంలో నిర్వహించిన సాధారణ స్క్రీనింగ్ పరీక్షల్లో ఈ జన్యు లోపాన్ని గుర్తించడం సాధ్యం కాలేదు. డెన్మార్క్‌కు చెందిన యూరోపియన్ స్పెర్మ్ బ్యాంక్ ఈ వీర్యాన్ని 14 దేశాల్లోని 67 క్లినిక్‌లకు సరఫరా చేసింది. ఈ ఏడాది డాక్టర్లు ఈ అంశాన్ని గుర్తించడంతో విషయం బయటపడింది. యూరోప్‌ అంతటా కనీసం 197 మంది చిన్నారులు ఈ దాత వీర్యంతో పుట్టి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో వీర్యదాతల స్క్రీనింగ్, సంతాన సాఫల్య చికిత్సలపై ఉన్న రూల్స్‌లోని లోపాలు బయటపడ్డాయి. యూకేలో ఒక దాత వీర్యాన్ని గరిష్ఠంగా 10 కుటుంబాలకు మాత్రమే ఉపయోగించాలనే నిబంధన ఉండగా, ఇతర దేశాల్లో అలాంటి కఠిన నియమాలు లేకపోవడమే ఈ దుస్థితికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం, ఈ జన్యు లోపంతో బాధపడుతున్న కుటుంబాలను వైద్యులు నిశితంగా పరిశీలిస్తూ, క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫాం హౌస్‌ పార్టీ వివాదం.. మాకేం సంబంధం లేదన్న మాధురి, శ్రీనివాస్

Akhanda 2: బాలయ్య కెరీర్లోనే రికార్డ్‌.. అఖండ2కు దిమ్మతిరిగే ఓపెనింగ్స్

Emanuel: టాస్క్‌లో గాయపడ్డ ఇమ్మాన్యుయేల్‌! నొప్పితో విలవిల

పాపం తనూజ..! అతడి కామెంట్‌కు ముఖం మాడ్చుకుంది

మెస్సీతో ఫోటో.. రూ.10 లక్షలు మాత్రమే