AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాపం తనూజ..! అతడి కామెంట్‌కు ముఖం మాడ్చుకుంది

పాపం తనూజ..! అతడి కామెంట్‌కు ముఖం మాడ్చుకుంది

Phani CH
|

Updated on: Dec 13, 2025 | 8:48 AM

Share

బిగ్ బాస్ లీడర్‌బోర్డులో ఫస్ట్ ఉన్న తనూజకు ప్రేక్షకులు గట్టి ఝలక్ ఇచ్చారు. ఓట్ అప్పీల్ చేసుకున్నప్పటికీ, ఆమె ఎమోషన్స్ 'నకిలీ' అని ప్రశ్నించారు. భరణిని 'నాన్న' అనకుండా 'సర్' అనడంపై, ఇమ్మాన్యుయేల్‌తో ఫ్రెండ్‌షిప్‌పై నిలదీశారు. తాను అందరి సపోర్ట్ తీసుకుంటుందని, కానీ ఇతరులకు ఇవ్వదని ఘాటు రిప్లై ఇవ్వడంతో తనూజ ముఖం వాడిపోయింది.

తనూజాకు ప్రేక్షకులు బిగ్ ఝలక్ ఇచ్చారు. లీడర్‌ బోర్డులో ఫస్ట్‌ ర్యాంక్‌లో ఉండడంతో… ప్రేక్షకుల ముందుకు వెళ్లే అవకాశాన్ని ఈమె రెండోసారి గెలుచుకుంది. బిగ్ బాస్ ఆదేశంతో.. తనతో సంజనను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నుకుంది. కట్ చేస్తే.. ప్రేక్షకులు తనూజకే ఓటేయడంతో ఆమె ఓట్‌ అప్పీల్‌ చేసుకుంది. తెలిసో తెలియక తప్పు చేసుంటే క్షమించమని కోరింది. ఇక ఆ తర్వాత జనాలడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ‘మీ ఏడుపు నిజమనిపించదు.. ఫేక్‌’ అని ఓ వ్యక్తి అనగా.. నేను కావాలని ఎమోషనల్‌ అవను, అది దానంతటదే వస్తుంది, ఇక్కడ ఏదీ ఫేక్‌గా ఉండదు అని చెప్పింది. వైల్డ్‌కార్డ్స్‌ వచ్చాక భరణి నాన్న కాస్తా… భరణి సర్‌ ఎందుకయ్యారు? అంటూ ఓ వ్యక్తి ప్రశ్నించగా.. మా మధ్య అనుబంధం ఇప్పటికీ అలాగే ఉందంటూ తనూజ ఆన్సర్ ఇచ్చింది. కాకపోతే తాము ఒకరికొకరు సపోర్ట్‌ చేసుకోవాలని వచ్చినప్పుడు… ఆ నాన్న అనే పిలుపు చూసేవారికి సింపతీగా కనిపిస్తోందని.. ఆయనకు ఎటువంటి ఇబ్బంది రావొద్దనే తాను ‘నాన్న’ అనే పిలుపును పక్కనపెట్టానంటూ క్లారిటీ ఇచ్చింది. ఇమ్మాన్యుయేల్‌ను ముఖం మీదే ఫ్రెండ్‌ కాదని ఎలా అంటావని తనూజాను నిలదీశాడో వ్యక్తి. దానికి తనూజ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలింది. వాడికి సపోర్ట్‌ చేయలేదా? అని రివర్స్‌లో అంటే.. మీరెక్కడ చేశారు మేడమ్‌? మీరే అందరి సపోర్ట్‌ తీసుకుంటారు అని దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. ఆ మాటకు తనూజ ముఖం వాడిపోయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెస్సీతో ఫోటో.. రూ.10 లక్షలు మాత్రమే

శేష వస్త్రాల కొనుగోలులో.. సశేష ప్రశ్నలెన్నో స్కామ్.. ఎలా బయటపడిందంటే..?

Published on: Dec 13, 2025 08:44 AM