AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టారిఫ్ ధరలు పెంచేసిన ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్

టారిఫ్ ధరలు పెంచేసిన ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్

Phani CH
|

Updated on: Dec 13, 2025 | 12:23 PM

Share

దేశంలో టెలికాం వినియోగదారులకు మళ్లీ టారిఫ్ భారం తప్పదు. రిలయన్స్ జియో మినహా, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి ప్రధాన టెలికాం సంస్థలు ప్లాన్ ధరలను పెంచనున్నాయి. ఆదాయ వృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం కారణంగా ఈ పెంపు 15% వరకు ఉండొచ్చు. ముఖ్యంగా 1.5GB డేటా ప్లాన్‌లపై రూ.50 వరకు పెరగవచ్చు. డిసెంబర్‌లో ఈ ధరల పెంపు అమలు కావచ్చు.

దేశంలోని టెలికం వినియోగదారులపై మరోసారి టారిఫ్ భారం పడనుంది. రిలయన్స్ జియో మినహా మిగిలిన అన్ని ప్రధాన టెలికం సంస్థలు ఇప్పటికే కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను సవరించడం ప్రారంభించాయి. రాబోయే మరికొన్ని వారాల్లోనే మరోసారి టారిఫ్ ధరలు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వొడాఫోన్ ఐడియా తన వార్షిక ప్లాన్ రూ. 1,999పై 12 శాతం ధరను పెంచగా, 84 రోజుల వ్యాలిడిటీ గల రూ. 509 ప్లాన్‌పై 7 శాతం పెంచింది. భారతీ ఎయిర్‌టెల్ కూడా తన బేసిక్ వాయిస్ ప్లాన్ రూ. 189ని రూ. 10 పెంచి రూ. 199కి చేర్చింది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కొన్ని ఎంట్రీ-లెవల్ ప్లాన్ల ధరలను పెంచకుండా వ్యాలిడిటీని తగ్గించింది. టెలికం సంస్థల ఆదాయ వృద్ధి గత నాలుగు త్రైమాసికాల్లో 14 నుంచి 16 శాతం ఉండగా, సెప్టెంబర్ త్రైమాసికంలో అది 10 శాతానికి తగ్గింది. ఈ నేపథ్యంలో కంపెనీలు ధరల పెంపునకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండటం, రాబోయే కొన్ని నెలల్లో పెద్ద ఎన్నికలేవీ లేకపోవడంతో డిసెంబర్‌లో టారిఫ్‌లు పెంచడానికి అనుకూల సమయమని అంచనావేస్తున్నారు. ఈ పెంపు సుమారు 15 శాతం వరకు ఉండొచ్చని, ముఖ్యంగా ఎక్కువ మంది వినియోగించే 1.5 జీబీ డేటా ప్లాన్‌ పై రూ. 50 వరకు భారం పడొచ్చని భావిస్తున్నారు. 5జీ సేవలు లేకపోవడంతో ఇప్పటివరకు తక్కువ ధరలకు ప్లాన్లు అందించిన వొడాఫోన్ ఐడియా, ఇప్పుడు ఇతర సంస్థలతో సమానంగా ధరలను సవరిస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత పెంపునకు, తదుపరి పెంపునకు మధ్య 15 నెలల గ్యాప్ ఉంటుందని, ఈసారి కూడా గతంలో మాదిరిగానే ధరల పెంపు ఉంటుందని వీఐ యాజమాన్యం గతంలోనే సంకేతాలిచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విహారయాత్రకు వెళ్ళొచ్చి.. ఇంటి గడియ తీసుంచి.. ఏంటా అని చూడగా..

ఒక్క వ్యక్తి జన్యువులో లోపం.. 200 మంది పిల్లలకు శాపం

ఫాం హౌస్‌ పార్టీ వివాదం.. మాకేం సంబంధం లేదన్న మాధురి, శ్రీనివాస్

Akhanda 2: బాలయ్య కెరీర్లోనే రికార్డ్‌.. అఖండ2కు దిమ్మతిరిగే ఓపెనింగ్స్

Emanuel: టాస్క్‌లో గాయపడ్డ ఇమ్మాన్యుయేల్‌! నొప్పితో విలవిల