AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత శాస్త్రవేత్తల అద్భుత సృష్టి.. జన్యు సమస్యల కోసం కొత్త ప్రొటీన్‌

భారత శాస్త్రవేత్తల అద్భుత సృష్టి.. జన్యు సమస్యల కోసం కొత్త ప్రొటీన్‌

Phani CH
|

Updated on: Dec 13, 2025 | 12:26 PM

Share

బోస్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు 'గ్లోక్యాస్9' అనే ప్రత్యేక క్రిస్పర్ ప్రొటీన్‌ను అభివృద్ధి చేశారు. ఇది జన్యు సవరణను ప్రత్యక్షంగా, కణాలకు హాని లేకుండా పర్యవేక్షించేందుకు వీలు కల్పిస్తుంది. సముద్ర రొయ్యల ఎంజైమ్‌తో రూపొందించిన ఈ ఆవిష్కరణ జన్యు సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ చికిత్సలలో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. సికిల్ సెల్ ఎనీమియా వంటి వాటికి ఇది మరింత ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తుంది.

జన్యు సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ చికిత్సలో సరికొత్త ఆశలు రేకెత్తిస్తూ భారత శాస్త్రవేత్తలు అద్భుత ఆవిష్కరణ చేశారు. జన్యు సవరణ చేస్తున్నప్పుడు వెలుగును విరజిమ్మే ‘గ్లోక్యాస్9’ అనే ఒక ప్రత్యేక క్రిస్పర్ ప్రొటీన్‌ను అభివృద్ధి చేశారు. కోల్‌కతాలోని బోస్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించినట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సాధారణంగా క్రిస్పర్-క్యాస్9 టెక్నాలజీ ద్వారా డీఎన్‌ఏను కత్తిరించి, సరిచేయడం సాధ్యమే. కానీ, ఈ ప్రక్రియను జీవించి ఉన్న కణాల్లో ప్రత్యక్షంగా చూడటం ఇప్పటివరకు సాధ్యపడలేదు. కణాలను నాశనం చేస్తేనే ఆ ప్రక్రియను గమనించగలిగేవారు. ఈ సమస్యను అధిగమించేందుకు బోస్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ బసుదేబ్ మాజి నేతృత్వంలోని బృందం ‘గ్లోక్యాస్9’ను రూపొందించింది. సముద్ర గర్భంలోని రొయ్యల ప్రొటీన్ల నుంచి సేకరించిన నానో-లూసిఫెరేజ్ అనే ఎంజైమ్‌ను క్యాస్9తో కలపడం ద్వారా దీనిని సృష్టించారు. జన్యు సవరణ సమయంలో ఈ ప్రొటీన్ మిణుకుమిణుకుమంటూ వెలుగును వెదజల్లుతుంది. ఈ కొత్త ప్రొటీన్ సాయంతో, కణాలకు హాని కలగకుండానే జన్యు సవరణ ప్రక్రియను శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చు. అంతేకాకుండా, సాధారణ క్యాస్9 ఎంజైమ్‌తో పోలిస్తే ‘గ్లోక్యాస్9’ అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా స్థిరంగా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఇది జన్యు చికిత్సల విజయవంతానికి ఎంతో కీలకం. ముఖ్యంగా సికిల్ సెల్ ఎనీమియా, కండరాల క్షీణత వంటి వ్యాధులకు కారణమైన జన్యు లోపాలను సరిచేసే హెచ్‌డీఆర్ ప్రక్రియ కచ్చితత్వాన్ని ఇది గణనీయంగా పెంచుతుంది. ఈ పరిశోధన వివరాలు ‘ఆంగేవాంటె కెమీ ఇంటర్నేషనల్ ఎడిషన్’ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ టెక్నాలజీని మొక్కలపై కూడా ప్రయోగించవచ్చని, పంటల అభివృద్ధిలో సురక్షితమైన మార్పులకు ఇది దోహదపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఆవిష్కరణ జన్యు చికిత్సా రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టారిఫ్ ధరలు పెంచేసిన ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్

విహారయాత్రకు వెళ్ళొచ్చి.. ఇంటి గడియ తీసుంచి.. ఏంటా అని చూడగా..

ఒక్క వ్యక్తి జన్యువులో లోపం.. 200 మంది పిల్లలకు శాపం

ఫాం హౌస్‌ పార్టీ వివాదం.. మాకేం సంబంధం లేదన్న మాధురి, శ్రీనివాస్

Akhanda 2: బాలయ్య కెరీర్లోనే రికార్డ్‌.. అఖండ2కు దిమ్మతిరిగే ఓపెనింగ్స్