AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Suman: ఆమె వల్లే నటుడు సుమన్‌పై బ్లూ ఫిల్మ్ కేసు.. ఏకంగా అప్పటి సీఎంకే లింకులు.? అసలు మ్యాటర్ ఏంటంటే

సీనియర్ నటుడు సుమన్ జీవితాన్ని కుదిపివేసిన వివాదాలు చాలానే ఉన్నాయి. గతంలో ఈ అంశంపై నటుడు సుమన్, అలాగే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అతడి ఫ్రెండ్ దర్శకుడు సాగర్ కూడా కీలక విషయాలు వెల్లడించాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Actor Suman: ఆమె వల్లే నటుడు సుమన్‌పై బ్లూ ఫిల్మ్ కేసు.. ఏకంగా అప్పటి సీఎంకే లింకులు.?  అసలు మ్యాటర్ ఏంటంటే
Actor Suman
Ravi Kiran
|

Updated on: Dec 12, 2025 | 11:09 AM

Share

సీనియర్ నటుడు సుమన్ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా స్టార్‌డమ్ సంపాదించాడు. అయితే క్రమంగా టాప్ హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో.. కొన్ని ఊహించని వివాదాలు సుమన్ జీవితం, కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. మరి ఇంతకీ ఆ వివాదాలతో వచ్చిన పుకార్ల అంశంపై సుమన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించాడు. తాను జైలు పాలవ్వడానికి అప్పటి తమిళనాడు సీఎం ఎంజీఆర్, రాష్ట్ర డీజీపీ, లిక్కర్ కాంట్రాక్టర్ వాడియార్‌లే ప్రధాన కారణం అని పేర్కొన్నాడు. అప్పటి ముఖ్యమంత్రి, డీజీపీ కలిసి సుమన్‌పై హై-లెవెల్ స్కెచ్ వేసి ఇరికించారట. ఆ సమయంలో సుమన్ మంచి అందగాడు, చాలా పాపులారిటీ సాధించాడు. డీజేపీ కుమార్తె సుమన్‌పై ఇష్టం పెంచుకుందట. అయితే అప్పటికే ఆమెకు పెళ్లైంది. అలాగే సుమన్ షూటింగ్ ఎక్కడున్నా.. పోలీస్ సెక్యూరిటీతో వెళ్ళేదట. ఇక ఆమెపై సుమన్‌కు ఎలాంటి ఇష్టం లేదు. అలాగే సుమన్ స్నేహితుడు ఒకడు లిక్కర్ కాంట్రాక్టర్ వాడియార్ కుమార్తెను ప్రేమించాడు.

డీజేపీ కుమార్తె వ్యవహారం ఎంజీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సుమన్‌ను పిలిపించారు. ఆ సమయంలో ఎంజీఆర్ మాట్లాడే స్థితిలో లేకపోవడంతో రాసి చూపించారు. ‘బాబు నువ్వు నటుడివి. నీకు ఎంతో భవిష్యత్తు ఉంది. ఇలాంటివి వద్దు’ అని ఎంజీఆర్ సుమన్‌కు సలహా ఇచ్చారు. దీనికి సుమన్ ‘ఆ విషయం నాకు కాదు చెప్పాల్సింది, ఆ అమ్మాయికి’ అని సున్నితంగానే బదులిచ్చాడట. సుమన్ ఇచ్చిన ఈ సమాధానం ఎంజీఆర్‌కు నచ్చలేదని.. అది తప్పుగా పోట్రే అయింది. ఎంజీఆర్‌కు కోపమొచ్చి.. డీజేపీతో కలిసి తన అధికారాన్ని ఉపయోగించి సుమన్‌పై అల్లర్ల కేసు పెట్టి అరెస్టు చేయించారట. లోలోపల అనేక కేసులు బనాయించినప్పటికీ, బ్లూ ఫిలిం కేసు కూడా పెట్టారన్న ప్రచారం విస్తృతంగా సాగింది. అయితే ఈ బ్లూ ఫిలిం కేసు వట్టి పుకార్లనేట. సుమన్ స్నేహితుడు ఒకరికి క్యాసెట్ల షాప్ ఉండటంతో ఆ సమయంలో ఈ పుకార్లు షికార్లు చేశాయి. కొన్ని నెలల పాటు సుమన్ జైలు జీవితం గడిపారు. సుమన్ తల్లికి గవర్నర్ బాగా తెలియడంతో త్వరగానే బెయిల్ వచ్చింది. కానీ, జైలు నుంచి బయటకు వచ్చేసరికి సుమన్ నమ్మి డబ్బు ఇచ్చిన స్నేహితులందరూ మోసం చేశారు, ఆ విధంగా సుమన్ అనేక ఇబ్బందులను ఎదుర్కున్నాడట.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
50 ఏళ్లుగా అదే ఆనవాయితీ... ఊరంతా ఒక్కటై కొలిచే గణనాథుడు
50 ఏళ్లుగా అదే ఆనవాయితీ... ఊరంతా ఒక్కటై కొలిచే గణనాథుడు
కేసీసీ లోన్ చెల్లించకపోతే బ్యాంకులు రైతుల భూమి జప్తు చేయవచ్చా..?
కేసీసీ లోన్ చెల్లించకపోతే బ్యాంకులు రైతుల భూమి జప్తు చేయవచ్చా..?
విద్యార్థులకు అలర్ట్.. ఇక ఇంటర్ పరీక్షల్లో 32 పేజీల ఆన్సర్ షీట్లు
విద్యార్థులకు అలర్ట్.. ఇక ఇంటర్ పరీక్షల్లో 32 పేజీల ఆన్సర్ షీట్లు
వాయిస్‌ కమాండ్‌తో అక్షరాలు ప్రింట్ చేసే సరికొత్త డివైజ్
వాయిస్‌ కమాండ్‌తో అక్షరాలు ప్రింట్ చేసే సరికొత్త డివైజ్
ఐఫోన్ 18 ప్రో కోసం భారీ క్యూ.. సోనూ సూద్ రియాక్షన్ వైరల్..
ఐఫోన్ 18 ప్రో కోసం భారీ క్యూ.. సోనూ సూద్ రియాక్షన్ వైరల్..
‘We, the People’.. ఆ పదాల వెనుక అసలు కథ ఇదే!
‘We, the People’.. ఆ పదాల వెనుక అసలు కథ ఇదే!
మళ్లీ ఎగబాకిన బంగారం ధరలు.. గంటల్లోనే సీన్ రివర్స్.. తులం ఎంతంటే
మళ్లీ ఎగబాకిన బంగారం ధరలు.. గంటల్లోనే సీన్ రివర్స్.. తులం ఎంతంటే
గణేష్ నిమజ్జనం తేదీ సమయం ఇదే.. ఎప్పుడు? ఎలా చేయాలో తెలుసా?
గణేష్ నిమజ్జనం తేదీ సమయం ఇదే.. ఎప్పుడు? ఎలా చేయాలో తెలుసా?
దేశ ప్రజలకు భారీ ఊరట.. భారత్‌లోకి తొలి డెంగ్యూ వ్యాక్సిన్
దేశ ప్రజలకు భారీ ఊరట.. భారత్‌లోకి తొలి డెంగ్యూ వ్యాక్సిన్
13 ఏళ్లుగా ఒక్క విద్యార్థి కోసం రోజూ 5 కి.మీ అడవిలో ట్రెక్కింగ్..
13 ఏళ్లుగా ఒక్క విద్యార్థి కోసం రోజూ 5 కి.మీ అడవిలో ట్రెక్కింగ్..