ప్రగతికి నా వల్లే మెడల్ వచ్చింది.. వశీకరణం చేస్తే.. కానీ.! జోతిష్యుడు వేణు స్వామి షాకింగ్ కామెంట్స్
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సినీ సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యారు. ఆయన తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ఏమన్నారో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి మరి.

వేణుస్వామి.. టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు. సినీ సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకులకు జాతకలు చెబుతూ ఈయన సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాడు. ఆయన ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు పంచుకున్నాడు. తన వృత్తి జ్యోతిష్యం అని.. తన వద్దకు వచ్చే ఏ వ్యక్తికైనా వారి బ్యాగ్రౌండ్‌తో సంబంధం లేకుండా జాతకం చెప్పడమే కాదు.. పూజలు కూడా చేస్తానని స్పష్టం చేశారు. డాక్టర్ లేదా మంగలి ఎవరొచ్చినా కూడా.. వారి పాపపరిహరాలను పోగొట్టడమే తన డ్యూటీ అన్నట్టు పేర్కొన్నారు. టాలీవుడ్ నటి ప్రగతి గురించి ప్రస్తావిస్తూ.. ‘ఆమె సినిమా కెరీర్‌తో పాటు రెజ్లింగ్‌లోనూ ఎదగాలనే ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చి పూజ చేయించుకుంది’ అని వేణుస్వామి వివరించారు. ఇక ఇటీవల ఆమె రెజ్లింగ్‌లో రజత పతకం సాధించిన విషయం తెలిసిందే.
తన పూజలలో వామాచారం, వశీకరణం లాంటి తాంత్రిక పద్దతులు వాడతానని ఆయన తెలిపారు. వశీకరణం అంటే ఆకర్షించడం అని.. దీనిలో తప్పు లేదని ఆయన సమర్థించారు. వామాచారాన్ని క్షుద్ర పూజలుగా అపార్థం చేసుకోవడం అజ్ఞానమని ఆయన పేర్కొన్నారు. శ్రీకాళహస్తి దేవాలయంలో నిమ్మకాయలతో చేసే రాహుకేతు పూజలు, పసుపు కుంకుమల వినియోగం తంత్ర మార్గంలో భాగమేనని అన్నారు. అలాగే మద్యం, మాంసం వాడకంపై వచ్చిన విమర్శలకు కూడా ఆయన బదులిచ్చారు. గంజాయిని మందులలో, స్టెరాయిడ్స్‌ను చికిత్సలో వాడుతున్నారు కదా అని చెప్పారు. గణేశుడు, తిరుమల వెంకన్న లాంటి దేవుళ్లకు సాత్విక పూజలుంటాయని.. తాను పూజించే కామాఖ్యా లాంటి దేవతలు ఉగ్ర దేవతలని, వీరికి పూజలు చేయాలంటే గురుముఖతః మంత్రం నేర్చుకోవాలని, దమ్ము, ధైర్యం కావాలని ఆయన తెలిపారు. కామాఖ్యాలో ఈ పద్ధతులు నేర్చుకుని దక్షిణాదిన వామాచారాన్ని తీసుకొచ్చింది తానేనని ఆయన ప్రకటించారు. తనను నమ్మకపోయినా పారలేదని.. కానీ తన మాటలు శాస్త్రంలో భాగమేనని వేణుస్వామి వెల్లడించారు. వామాచారం, కామాఖ్యా ఆలయం, తంత్ర పూజలు గురించి తెలుసుకోవాలనుకుంటే గూగుల్, చాట్ జీపీటీ లాంటి వాటిలో స్వయంగా సెర్చ్ చేసి నిజాలు తెలుసుకొండి అని వేణుస్వామి అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..








