హీరోయిన్స్ పనికిరారు గురూ..! కమల్ కామరాజు భార్యను చూశారా.?
హీరోగా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత అంతగా సక్సెస్ అవ్వలేదు.. ఆతర్వాత సహాయక పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నటుడు కమల్ కామరాజు. అర్జున్ రెడ్డి సినిమాలో తన నటనతో మెప్పించాడు కమల్. అలాగే పలు సినిమాల్లో తన నటీనతో అలరించాడు కమల్ కామరాజు

శేఖర్ కమ్ముల నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఆవకాయ్ బిర్యానీ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు నటుడు కమల్ కామరాజు. హీరోగా కెరీర్ ప్రారభించిన కమల్ కామరాజు. ఆతర్వాత పలు సినిమాల్లో సహాయక పాత్రలు చేశాడు. అనుకోకుండా ఒకరోజు, ఛత్రపతి, గోదావరి, జల్సా, అరవింద్2, కాటమరాయుడు, అర్జున్ రెడ్డి, మహర్షి, వకీల్ సాబ్ తదితర సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైపోయాడు. తానొక సెలబ్రిటీ అయినా సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంటాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఎలాంటి వివాదాల్లోనూ తలదూర్చడు. సోషల్ మీడియాలోనూ చాలా తక్కువగా కనిపిస్తుంటారు. అప్పుడప్పుడు తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ మాత్రమే ఇస్తుంటారు. ఇటీవల విరూపాక్ష సినిమాలో మెప్పించాడు.
ఇక కమల్ కామరాజు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నెట్టింట యాక్టివ్ గా ఉండే ఈ వర్సటైల్ యాక్టర్ తాజాగా తన భార్య ఫోటోలను పంచుకున్నారు. వివాహం జరిగి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన భార్య ఫోటోలను పంచుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు కమల్ కామరాజు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయనకు నెటిజన్స్ విషెస్ తెలుపుతున్నారు.
మహారాష్ట్రలో పుట్టినప్పటికీ హైదరాబాద్‌లోనే పెరిగాడు కమల్ కామరాజు. మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న జవహరల్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆతర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. హీరోగా సినిమాలు చేయడంతో పాటు పలు సినిమాల్లో సహాయక పాత్రల్లోనూ మెప్పించారు.
View this post on Instagram




