Roshan Kanakala: విడాకులు తీసుకున్నారా అన్న ప్రశ్నకు రోషన్ షాకింగ్ రియాక్షన్
యాంకర్ సుమ, రాజీవ్ కనకాల విడాకులపై కొన్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలపై వారి తనయుడు రోషన్ కనకాల స్పందించారు. ఈ వార్తలు తమ కుటుంబానికి చాలా బాధ కలిగించాయని, ఎమోషనల్‌గా ప్రభావితం చేశాయని ఆయన తెలిపారు. తమ కుటుంబంలో అటువంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. బయటి ప్రచారానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, తమ బంధంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని రోషన్ వెల్లడించారు.
యాంకర్ సుమ.. తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. దశాబ్దాలుగా బుల్లితెరపై ఎన్నో టీవీ షోలు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లతో ఎప్పుడూ బిజీగా ఉంటారు. మరోవైపు రాజీవ్ కనకాల సైతం చేతినిండా సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తుంటారు. ఇప్పుడు సుమ, రాజీవ్ కనకాల దంపతుల తనయుడు రోషన్ కనకాల కూడా హీరోగా అలరిస్తున్నాడు. బబుల్ గమ్ సినిమాతో హీరోగా పరిచయమైన రోషన్.. ఇప్పుడు మోగ్లీ సినిమాతో అడియన్స్ ముందుకు రానున్నాడు. కలర్ ఫోటో ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 13న విడుదలైంది. డీసెంట్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ముందు ఈ మూవీ ప్రమోషన్లో ఉన్న రోషన్‌కు.. తన అమ్మా నాన్నల విడాకులు గురించి ఓ షాకింగ్ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ఈ హీరో చెప్పిన ఆన్సర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుమ, రాజీవ్ కనకాల విడాకులు తీసుకుంటున్నారంటూ గత మూడు సంవత్సరాలుగా వచ్చిన రూమర్స్ పై రోషన్ స్పందించారు. ఈ వార్తలు తమ కుటుంబానికి చాలా బాధ కలిగించాయని, తమను ఎమోషనల్ గా ప్రభావితం చేశాయని అన్నారు. తమ కుటుంబంలో అటువంటి సమస్యలు లేవని తమకు స్పష్టంగా తెలుసని, కానీ బయట జరుగుతున్న ప్రచారం వల్ల తాము చాలా ఇబ్బంది పడ్డామని రోషన్ అన్నారు. మొదట్లో తన తల్లి సుమ కూడా ఈ రూమర్ల వల్ల బాధపడినా, చివరికి వాటిని పట్టించుకోవడం మానేశారని రోషన్ పేర్కొన్నారు. ఎందుకంటే తమ కుటుంబంలో ఏం జరుగుతుందో తమకు తెలుసని, ఇతరుల అభిప్రాయాలకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని తాము నిర్ణయించుకున్నామని రోషన్ స్పష్టం చేశారు. కుటుంబం విషయంలో ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత ధనవంతుడైనా మనుషులమేనని, ఎమోషనల్ బాండింగ్ ఉంటుందని, అటువంటి రూమర్స్ తమకు బాధను కలిగిస్తాయని రోషన్ అన్నారు. ప్రస్తుతం రోషన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akhanda 2: బాలయ్య కెరీర్లోనే రికార్డ్.. అఖండ2కు దిమ్మతిరిగే ఓపెనింగ్స్
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!
ఆ మహిళలకు బంపర్ ఆఫర్ .. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.15 వేలు
ఆ దేశం లో టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్.. ఎందుకో వీడియో తెలుసుకోండి
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో

