AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..

ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..

Phani CH
|

Updated on: Dec 13, 2025 | 1:18 PM

Share

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులోని గూళ్యం గ్రామంలో వినూత్న సంప్రదాయం ఉంది. ఇక్కడ ప్రతి బిడ్డకూ 'గాది లింగా' అనే పేరు పెడతారు. ప్రజలు నమ్మే గాది లింగేశ్వరస్వామి మహిమలకు నిదర్శనంగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఒకే పేరు ఉండటం వల్ల పిలిచినప్పుడు పదుల సంఖ్యలో స్పందించడం నవ్వు తెప్పిస్తుంది. ఏటా ఇక్కడ రథోత్సవాలు ఘనంగా జరుగుతాయి.

సాధారణంగా ఒకే ఊర్లో చాలామందికి చిన్నపాటి మార్పుతో ఒకేరకమైన పేర్లు ఉండటం సహజం. ఆ గ్రామస్తులు నమ్మి కొలిచే దేవుడి పేరును వారి పిల్లలకు పెట్టుకుంటారు. అయితే ఊర్లో మొత్తం అందరికీ ఒకటే పేరు ఉంటే.. ఎవరినైనా పిలవాలంటే కొంచెం కష్టమే.. ఎవర్ని పిలిచినా సమీపంలో ఉన్నవారంతా పలుకుతారు. తాజాగా అలాంటి ఓ గ్రామం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్ర-కర్నాటక సరిహద్దులో వేదవతీ నది ప్రవహించే పవిత్రమైన నదీతీర ప్రాంతం అది. ఈ ప్రాంతానికి సమీపంలోనే గూళ్యం అనే ఓ చిన్న గ్రామం ఉంది. ఇక్కడ గాది లింగేశ్వరస్వామి, సిద్ధ లింగేశ్వర స్వామి అని ఇద్దరు గురు శిష్యులు ఉండేవారు. వీరు గొర్రలను కాస్తూ నది ఒడ్డునే జీవనం సాగించేవారు. వారిని స్థానికులు అవధూతలుగా, దేవుళ్లుగా భావించి పూజించేవారు. ఎందుకంటే వారు కర్నాటలోని చాలా గ్రామాల్లో అనేక మహిమలు చూపారని స్థానికులు చెబుతారు. కాలక్రమంలో గాదిలింగేశ్వరస్వామికి ఆయన భక్తులు ఆలయం నిర్మించారు. నిత్యం భక్తితో పూజలు, అర్చనలు చేస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా గాదిలింగేశ్వరస్వామివారిని కొలుస్తారు. అంతేకాదు స్వామివారి పేరును ఆ గ్రామంలోని ప్రతి ఇంట్లో పుట్టిన ప్రతి బిడ్డకూ గాది లింగా అని పేరు పెట్టడం ఇక్కడి ఆనవాయితీ. ఎవరికైనా తాము నమ్మిన దైవం పేరు పెట్టకపోతే అరిష్టం జరుగుతుందని వారు నమ్ముతారు. ఇక గ్రామంలో జరిగే ఏ కార్యక్రమానికైనా గ్రామస్తులంతా హాజరవుతారు. ఈ క్రమంలో ఎవరిని పిలిచినా నన్నేనా పిలిచింది అని.. పదుల సంఖ్యలో స్పందిస్తారు. అంతటి ప్రాముఖ్యత ఈ స్వామి గాది లింగేస్వర కే దక్కింది. ప్రతి ఏటా గురు శిష్యులు శ్రీ గాదిలింగేశ్వర, సిద్ద లింగేశ్వర స్వామి వార్లకు జోడు రధోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైనాను భయపెడుతున్న రోబోల విస్తరణ.. చివరికి ఏమవుతుందో

శేష వస్త్రాల కొనుగోలులో.. సశేష ప్రశ్నలెన్నో స్కామ్.. ఎలా బయటపడిందంటే..?

Yashasvi Jaiswal: ఆయన అలా తిడితేనే మాకు హ్యాపీ

వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు

భారత శాస్త్రవేత్తల అద్భుత సృష్టి.. జన్యు సమస్యల కోసం కొత్త ప్రొటీన్‌