AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శేష వస్త్రాల కొనుగోలులో.. సశేష ప్రశ్నలెన్నో స్కామ్.. ఎలా బయటపడిందంటే..?

శేష వస్త్రాల కొనుగోలులో.. సశేష ప్రశ్నలెన్నో స్కామ్.. ఎలా బయటపడిందంటే..?

Phani CH
|

Updated on: Dec 13, 2025 | 1:08 PM

Share

టీటీడీ పట్టు వస్త్రాల కొనుగోళ్లలో 54 కోట్ల రూపాయల భారీ అవినీతి బయటపడింది. స్వామివారికి, VIPలకు వాడే పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్ అంటగట్టారు. టీటీడీ అంతర్గత విచారణలో ఈ మోసం వెల్లడి కావడంతో, విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీకి కేసు అప్పగించాలని నిర్ణయించారు. ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

తిరుమల స్వామివారి పట్టు వస్త్రాల కొనుగోళ్లలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని టీటీడీ ఓ అంచనాకొచ్చింది. స్వామికి వాడే పట్టు వస్త్రాలతో పాటు.. స్వామి దర్శనానికి వచ్చే ప్రత్యేక అతిథులు, దాతలు, VIPలకు ఆశీర్వచనం అనంతరం కప్పే పట్టు శాలువాల కొనుగోళ్లలో భారీ అవినీతి బయటికొచ్చింది. 2010 నుంచి పట్టు పేరుతో పాలిస్టర్ వస్త్రాలను టీటీడీకి అంటగడుతూ.. కోట్లు కొల్లగొడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు అది పట్టే కాదనే అంశం రెండు నెలల క్రితం జరిగిన టీటీడీ బోర్డు మీటింగ్‌లోనే చర్చకొచ్చిందని,దానిపై అంతర్గతంగా విచారణ జరిపించగా, అసలు విషయం బయటికొచ్చినట్లు తెలుస్తోంది. ఈ పట్టు వస్త్రాల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటిదాకా 54 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అనుమానిస్తున్న టీటీడీ, విజిలెన్స్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తును ఏసీబీకి అప్పగించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. గత సెప్టెంబర్‌లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కొనుగోలు చేసిన వస్త్రాలే ఈ స్కామ్ బయటకు రావడానికి కారణం. బీఆర్ నాయుడు టీటీడీకి వస్త్రాలు సరఫరా చేస్తున్న ఏజెన్సీ ద్వారానే తనను కలిసే వ్యక్తిగత అతిథులను సన్మానించేందుకు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఒక్కో శాలువాకూ 350 రూపాయిలు చెల్లించారు. కాగా, తర్వాత అంత తక్కువ ధరకు పట్టు ఎలా వస్తుందనే అనుమానం రావడం, శాలువాల నాణ్యతలోనూ తేడాలుండటంతో సెప్టెంబర్ 16న జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ అంశాన్ని చర్చించి.. నివేదిక ఇవ్వాలని విజిలెన్స్‌ను ఆదేశించారు. వెంటనే విజిలెన్స్ అధికారులు తిరుమలలోని వైభవోత్సవ మండపం, తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం నుంచి ఒక్కోచోట రెండేసి వస్త్రాల శాంపిల్స్‌ను సేకరించి.. వాటిని ధర్మవరం, బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డుకు నాణ్యత పరీక్షల కోసం పంపారు. సెంట్రల్ సిల్క్ బోర్డు ఇచ్చిన శాంపిల్స్ రిపోర్ట్ ప్రకారం..ఆ శాలువాలు టీటీడీ నిబంధనలకు తగినట్లు లేకపోవని తేలిపోయింది. 2015 నుంచి 2025 వరకు ఈ తరహా శాలువాలను నగరి సమీపంలోని VRS ఎక్స్ ఫర్ట్స్ పంపిణీ చేసింది. తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం నుంచి సేకరించిన శాంపిల్ వస్త్రాలకు కాంచీపురం సెంట్రల్ సిల్క్ బోర్డు అప్రూవల్ ఇవ్వడంపైనా టీటీడీ విజిలెన్స్‌ అనుమానం వ్యక్తం చేస్తోంది. అక్కడి ల్యాబ్‌లో అవకతవకలు జరిగి ఉంటాయన్న అనుమానంతో దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం టీటీడీ వద్ద 15 రోజులకు సరిపడా వస్త్రాలు అందుబాటులో ఉన్నందున, భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఉన్న వస్త్రాలనే వేదాశీర్వచనంలో వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ అవినీతిపై పూర్తిస్థాయి విచారణ మరింత మంది అధికారుల పాత్రను బయటపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Yashasvi Jaiswal: ఆయన అలా తిడితేనే మాకు హ్యాపీ

వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు

భారత శాస్త్రవేత్తల అద్భుత సృష్టి.. జన్యు సమస్యల కోసం కొత్త ప్రొటీన్‌

టారిఫ్ ధరలు పెంచేసిన ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్

విహారయాత్రకు వెళ్ళొచ్చి.. ఇంటి గడియ తీసుంచి.. ఏంటా అని చూడగా..