AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాను భయపెడుతున్న రోబోల విస్తరణ.. చివరికి ఏమవుతుందో

చైనాను భయపెడుతున్న రోబోల విస్తరణ.. చివరికి ఏమవుతుందో

Phani CH
|

Updated on: Dec 13, 2025 | 1:16 PM

Share

చైనాలో ఏఐ ట్రాఫిక్ పోలీస్ రోబో విధుల్లోకి దిగి వైరల్‌గా మారింది, ఉల్లంఘనలను గుర్తించి హెచ్చరిస్తోంది. అయితే, హ్యూమనాయిడ్ రోబో కంపెనీల వేగవంతమైన విస్తరణపై చైనా అగ్రశ్రేణి ఆర్థిక సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రోటోటైప్‌లు ఉన్నా, పెద్ద ఎత్తున ఉత్పత్తికి పనికిరావని, మార్కెట్ సంతృప్తమైతే రోబోటిక్ రంగం దెబ్బతింటుందని హెచ్చరించింది. సరైన R&D లేకపోతే ప్రమాదమని పేర్కొంది.

ఏఐ రోబోల సంఖ్య చైనాలో ఎక్కువైంది. ట్రాఫిక్ డ్యూటీలోకి ఏఐ రోబో దిగిన వీడియో వైరలవుతోంది. జెజియాంగ్ ప్రావిన్స్‌లోని ఒక జంక్షన్ వద్ద AI-ఆధారిత రోబో తన డ్యూటీ ప్రారంభించింది. ట్రాఫిక్ కమాండ్ సంజ్ఞలను ప్రదర్శించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి హెచ్చరికలు జారీ చేసింది. చైనా ఏఐ రోబోటిక్ రంగంతో ఇది సరికొత్త విప్లవంగా మారిపోయింది. వాతహనదారులు రోబో ట్రాఫిక్ పోలీస్ అద్భుత సామర్థ్యాలను చూసి ఆశ్చర్యపోయారు. స్పష్టమైన చేతి సంకేతాలను ప్రదర్శించింది. ట్రాఫిక్ పోలీస్ మాదిరిగానే విజిల్ ఊదింది. హెల్మెట్లు లేని రైడర్లు, సిగ్నల్ లైన్‌పై ఆగే వాహనాలు, పాదచారుల జంపింగ్‌ ని గుర్తించి అక్కడికక్కడే రిమైండర్‌లు జారీ చేసింది. నూతన ఏఐ ట్రాఫిక్ పోలీస్ రోబో కనీసం 8 గంటలు పనిచేస్తుందని తెలుస్తుంది. హాంగ్‌జౌ కంపెనీ తర్వాతి తరం ట్రాఫిక్-నిర్వహణ రోబోల తయారీపై ఫోకస్‌ పెట్టింది. పూర్తి రోబో ట్రాఫిక్‌ పోలీస్‌ టీమ్ ను తయారు చేసేందుకు ప్రయత్నిస్తుంది. చైనా హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేసే కంపెనీల వేగవంతమైన విస్తరణ ఆ దేశ అగ్రశ్రేణి ఆర్థిక ప్రణాళిక సంస్థను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా కంపెనీలు తయారు చేసిన రోబోల ప్రోటోటైప్‌లు ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ అవి కర్మాగారాలు, గృహాలు లేదా ప్రజా సేవలో పెద్ద ఎత్తున వినియోగించదగిన రోబోలుగా మాత్రం అందుబాటులోకి రావడం లేదని అభిప్రాయపడుతుంది. ప్రజావసరాలు, ఉత్పత్తి, డిమాండ్ల మధ్య వ్యత్యాసాలు పెరిగితే రోబోటిక్ రంగం కుప్పకూలుతుందనే భయాలను పెంచింది. ఏకంగా 150 కి పైగా కంపెనీలు హ్యూమనాయిడ్ రోబోల తయారీలోకి దిగడం మంచిది కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకే తరహా ఆవిష్కరణలు మార్కెట్ ను ముంచెత్తితే అసలైన పరిశోధన, అభివృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఎన్‌డీఆర్‌సీ హెచ్చరించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శేష వస్త్రాల కొనుగోలులో.. సశేష ప్రశ్నలెన్నో స్కామ్.. ఎలా బయటపడిందంటే..?

Yashasvi Jaiswal: ఆయన అలా తిడితేనే మాకు హ్యాపీ

వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు

భారత శాస్త్రవేత్తల అద్భుత సృష్టి.. జన్యు సమస్యల కోసం కొత్త ప్రొటీన్‌

టారిఫ్ ధరలు పెంచేసిన ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్