అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..
కాకినాడ జిల్లా జగ్గంపేటలో చైన్ స్నాచర్లు కొత్త పద్ధతిలో రెచ్చిపోయారు. ఇల్లు అద్దెకు అడుగుతున్న నెపంతో ఇంట్లోకి చొరబడి, మత్తు మందు చల్లి మహిళ మంగళసూత్రాన్ని దొంగలించారు. బాధితురాలు సుబ్బలక్ష్మి గాయపడ్డారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది.
కాకినాడ జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఇప్పటి వరకు బైక్ పై వచ్చి రోడ్డు పై వెళ్తున్న మహిళల మెడలో నుండి బంగారు గొలుసులు తెంచుకుని పోతున్న స్నాచర్లు.. ఇప్పడు నేరుగా ఇళ్లలోకి చొరబడి మహిళను టార్గెల్ చేసి.. బంగారు గొలుసులు తెంపుకుపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కాకినాడ జిల్లా జగ్గంపేటలో చోటు చేసుకుంది. జగ్గంపేటలో ఇల్లు అద్దెకి కావాలని వచ్చిన ఇద్దరూ యువకులు ఓ ఇంటికి వచ్చారు. ఆమెను ఇల్లు చూపించాలని కోరారు. ఆమె ఇంటి తలుపులు తీసి.. గదులు చూపిస్తుండగా.. వారిలో ఒకరు ఆమె మీద మత్తు మందు స్ప్రే చేశాడు. అనంతరం ఆమె మెడలోని మెడలో ఉన్న మంగళసూత్రం, నల్లపూసల తాడు తెంపుకొని వెళ్లారు. ఈ క్రమంలో బాధితురాలు సుబ్బలక్ష్మి మెడకు గాయాలయ్యాయి. కాసేపటికి తేరుకున్న భాధితురాలు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజీలో దుండగులు పారిపోతున్న దృశ్యాలు రికార్డ్ కావటంతో ఆ దిశగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. పోలీసులకి బాధితురాలు ఫిర్యాదు చేయడంతో జగ్గంపేట ఎస్సై రఘునందన్ రావు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TTD: భక్తుల సేవలపై టీటీడీ కీలక నిర్ణయం.. మరింతగా మెరుగుపరిచేందుకు ప్లాన్
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
చైనాను భయపెడుతున్న రోబోల విస్తరణ.. చివరికి ఏమవుతుందో
శేష వస్త్రాల కొనుగోలులో.. సశేష ప్రశ్నలెన్నో స్కామ్.. ఎలా బయటపడిందంటే..?
అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు
విహారయాత్రకు వెళ్ళొచ్చి.. ఇంటి గడియ తీసుంచి.. ఏంటా అని చూడగా..
ఒక్క వ్యక్తి జన్యువులో లోపం.. 200 మంది పిల్లలకు శాపం
భూమిపైన నూకలుంటే.. చావు నుండి ఇలా తప్పించుకుంటారు..
కారును ఢీకొన్న విమానం.. ఫ్లోరిడా రోడ్డుపై షాకింగ్ ఘటన

