AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..

పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..

Phani CH
|

Updated on: Dec 13, 2025 | 1:30 PM

Share

మధ్యప్రదేశ్‌లోని మంగత్‌పురా గ్రామంలో అరుదైన సంఘటన జరిగింది. నిరుపేద రైతు బిడ్డ లక్ష్మి పెళ్లికి డబ్బు లేకపోవడంతో గ్రామస్థులు చందాలు పోగు చేసి, లక్ష రూపాయలకు పైగా సేకరించి ఘనంగా వివాహం జరిపించారు. విందు ఏర్పాటుతో పాటు వస్తువులు, కానుకలు ఇచ్చి, మిగిలిన డబ్బు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. గ్రామస్థుల మానవత్వం, సామాజిక బాధ్యత అందరికీ ఆదర్శం.

ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉంది అనిపిస్తుంటుంది. ఓ నిరుపేద రైతు బిడ్డకు గ్రామం అంతా ఏకమై పెళ్లి చేసింది. ప్రతి కుటుంబం తమ ఇంటి బిడ్డకే పెళ్లి చేస్తున్నామన్నట్లుగా అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. మానవత్వం పరిమళించిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భిండ్‌ జిల్లా మంగత్‌పురాలో చోటు చేసుకుంది. గ్రామస్థులంతా కలిసి తలో చెయ్యి వేసి నిరుపేద రైతు బిడ్డకు పెళ్లి చేయడం ద్వారా గొప్ప మానవతా స్ఫూర్తిని చాటారు. గ్రామానికి చెందిన రాకేశ్‌ కుశ్వాహా కుమార్తె లక్ష్మి వివాహం వికాస్‌ అనే యువకుడితో నిశ్చయించారు. డిసెంబరు 6న పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌ చేశారు. అయితే గతంలో కౌలురైతుగా ఉన్న రాకేశ్‌ ప్రస్తుతం దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. పెళ్లికి సమయం దగ్గరపడుతున్నా డబ్బు సమకూరక ఇంటిల్లిపాదీ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అందరూ ఒక్కటై లక్ష రూపాయలకు పైనే విరాళాలు సేకరించారు. కొందరు గోధుమలు, కావాల్సిన వస్తువులు సమకూర్చారు. మిఠాయి వ్యాపారి లల్లూ ఉచితంగా మిఠాయిలు ఇచ్చారు. శిశుపాల్‌ నర్వారియా అనే సప్లయర్స్‌ వ్యాపారి పైసా తీసుకోకుండా కుర్చీలు, వేదిక, లైటింగు తదితర ఏర్పాట్లను చేశారు. చక్కటి విందుతో వివాహం ఘనంగా జరిగింది. అప్పగింతల సమయంలో లక్ష్మికి కుట్టు మిషను, మిక్సీ, గ్యాస్‌ స్టవ్, టీవీ వంటి కానుకలు కూడా గ్రామస్థులు ఇచ్చారు. ఖర్చులు పోగా.. మిగిలిన రూ.18 వేల నగదును లక్ష్మి పేరుపై ఫిక్స్‌డ్‌ డిపాజట్‌ చేశారు. మంగత్‌పురా వాసుల మానవత్వాన్ని పలువురు అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..

TTD: భక్తుల సేవలపై టీటీడీ కీలక నిర్ణయం.. మరింతగా మెరుగుపరిచేందుకు ప్లాన్

ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..

చైనాను భయపెడుతున్న రోబోల విస్తరణ.. చివరికి ఏమవుతుందో

శేష వస్త్రాల కొనుగోలులో.. సశేష ప్రశ్నలెన్నో స్కామ్.. ఎలా బయటపడిందంటే..?