TTD: భక్తుల సేవలపై టీటీడీ కీలక నిర్ణయం.. మరింతగా మెరుగుపరిచేందుకు ప్లాన్
తిరుమల భక్తుల సేవల నాణ్యతను పెంచడానికి టీటీడీ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. సీఎం ఆదేశాల మేరకు, భక్తుల నుంచి విస్తృతంగా అభిప్రాయ సేకరణకు ఐవీఆర్ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవకులు, డైరెక్ట్ సర్వేలు వంటి బహుళ మాధ్యమాలను ఉపయోగిస్తోంది. అన్నప్రసాదం, వసతి, ఆలయ అనుభవంతో సహా 17 అంశాలపై అభిప్రాయాలు సేకరించి, వాటిని విశ్లేషించి తిరుమల యాత్ర అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యం.
తిరుమల వచ్చే భక్తులకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరచేందుకు టీటీడీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేవస్థానం తరపున అందుతున్న సేవలు, సిబ్బంది పనితీరుపై భక్తుల నుంచి విస్తృతంగా అభిప్రాయ సేకరణకు టీటీడీ తెర తీసింది.సీఎం చంద్రబాబు నాయుడి ఆదేశం మేరకు వివిధ రకాల ఫీడ్‌బ్యాక్ సర్వేలను రూపొందించిన టీటీడీ..ఐవీఆర్ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ సర్వే ద్వారా భక్తులు తిరుమల యాత్ర పూర్తి అనుభవం, అన్న ప్రసాదం, కళ్యాణ కట్ట, శ్రీవారి ఆలయం, వసతి, లగేజ్ కౌంటర్ తోపాటు ప్రైవేట్ హోటళ్ల ధరలపై మొత్తం 17 ప్రశ్నలపై యాత్రికులు అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. తిరుమల, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై శ్రీవారి సేవకుల సహకారంతో ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ టీటీడీ చేస్తోంది. ఈ విధానంలో సేవకులు ప్రశ్నావళితో కూడిన పత్రాలను అందిస్తారు. ఇందులో భక్తులు వివరాలు నమోదు చేసి తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. భక్తుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ, సేవలను మరింత మెరుగుపరచడం కోసం ఈ సర్వే ద్వారా వారి ప్రత్యక్ష అనుభవాలను సేకరించడం జరుగుతోంది. ప్రతినెలా మొదటి శుక్రవారం టీటీడీ నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా టీటీడీ ఈవో స్వయంగా భక్తులతో మాట్లాడి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఇందుకు భక్తులు 0877-2263261 కు కాల్ చేసి తమ అభిప్రాయాలను టీటీడీ ఈవోకు నేరుగా తెలుపవచ్చు. టీటీడీ అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరిచేందుకు టీటీడీ ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా కూడా భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఇలా వివిధ మాధ్యమాల ద్వారా భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని అధిక సంఖ్యలో భక్తులకు ఉపయోగపడేలా సేవలను మరింత నాణ్యంగా అందించేందుకు టీటీడీ కృషి చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
చైనాను భయపెడుతున్న రోబోల విస్తరణ.. చివరికి ఏమవుతుందో
శేష వస్త్రాల కొనుగోలులో.. సశేష ప్రశ్నలెన్నో స్కామ్.. ఎలా బయటపడిందంటే..?
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు
విహారయాత్రకు వెళ్ళొచ్చి.. ఇంటి గడియ తీసుంచి.. ఏంటా అని చూడగా..
ఒక్క వ్యక్తి జన్యువులో లోపం.. 200 మంది పిల్లలకు శాపం
భూమిపైన నూకలుంటే.. చావు నుండి ఇలా తప్పించుకుంటారు..
కారును ఢీకొన్న విమానం.. ఫ్లోరిడా రోడ్డుపై షాకింగ్ ఘటన
కొండ అంచున సెల్ఫీ.. కట్ చేస్తే... 130 అడుగుల నుండి

