అబ్బా జస్ట్ మిస్.. లేదంటే అఖండలో మనోజ్ కూడా రెచ్చిపోయేటోడు
అఖండ 2 సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. బాలయ్య రుద్ర తాండవం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి పోషించిన భయంకరమైన తాంత్రికుడి విలన్ పాత్ర హైలైట్. అయితే, ఈ పాత్రకు ఆది పినిశెట్టి మొదటి ఎంపిక కాదట. ముందుగా మంచు మనోజ్‌కు బోయపాటి శీను ఆఫర్ చేయగా, ఇతర కమిట్‌మెంట్ల వల్ల మనోజ్ చేయలేకపోయాడని తెలుస్తోంది.
అన్నీ అడ్డంకులు అధిగమించి బాలయ్య అఖండ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. బాలయ్య రుద్ర తాండవంతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. ఆయన యాక్షన్ సీక్వెన్సులు, ఫైట్స్, డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. బోయపాటి శీను గత సినిమాల్లాగానే అఖండ 2లో కూడా భారీ క్యాస్టింగ్ ఉంది. ఈ మూవీలో సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటించింది. అలాగే బజరంగీ భాయిజాన్ ఛైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా, జగపతి బాబు, ఆది పినిశెట్టి, కబీర్ దుల్హన్ సింగ్, సాస్వత ఛటర్జీ, అచ్యుత్ కుమార్, పూర్ణ, సాయి కుమార్, హర్ష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక అఖండ 2 సినిమాలో చాలా మంది విలన్లు నటించారు. అందులో ఆది పినిశెట్టి కూడా ఉన్నాడు. తాంత్రికుడి పాత్రలో అతని ఆహార్యం, లుక్ ఆడియెన్స్ ను భయపెట్టాయి. నెగెటివ్ షేడ్స్ తో కూడిన ఈ తాంత్రికుడి క్యారెక్టర్ కు ఆది పినిశెట్టి ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ క్యారెక్టర్ కోసం చాలా మంది స్టార్స్ ను సంప్రదించారట డైరెక్టర్ బోయపాటి శీను. ముందుగా మంచు మనోజ్‌కు ఆఫర్ ఇచ్చారట. బోయపాటి స్వయంగా తనకు కథ కూడా వినిపించాడట. అయితే ఇప్పటికే తన చేతిలో పలు సినిమాలు ఉండడంతో మనోజ్ ఈ సినిమా చేయలేకపోయాడట. ఆ తర్వాత ఈ పాత్ర కోసం మరికొందరు హీరోలను కలిశారట బోయపాటి. కానీ ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో చివరకు ఆది పినిశెట్టి దగ్గరకు ఈ మూవీ వెళ్లిందట. అతని ఫ్రెండ్స్ కూడా ఈ క్యారెక్టర్ చేయమని సజెస్ట్ చేయమనడంతో ఆది వెంటనే కథ విన్నాడట. ఆ వెంటనే నటించేందుకు కూడా ఓకే చెప్పాడట. అలా మొత్తానికి అఖండ 2 సినిమాలో ఆది పినిశెట్టి ఫైనల్ అయ్యాడట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Roshan Kanakala: విడాకులు తీసుకున్నారా అన్న ప్రశ్నకు రోషన్ షాకింగ్ రియాక్షన్
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో

