సిరీస్ కాదు సినిమానే.. మూడో భాగం కూడానా ??
భారతీయ సినీ పరిశ్రమలో మల్టీ-పార్ట్ చిత్రాల ట్రెండ్ పెరుగుతోంది. ఒకప్పుడు రెండు భాగాలకే పరిమితమైన సీక్వెల్స్, ఇప్పుడు వెబ్ సిరీస్‌ల మాదిరిగా మూడు లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా వస్తున్నాయి. పుష్ప 3, KGF 3, అఖండ 3, లూసిఫర్ 3 వంటి చిత్రాలు దీనికి ఉదాహరణ. దర్శకులు కథ విస్తరణ కోసమే కాకుండా, మార్కెట్ దృష్ట్యా కూడా ఈ కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు.
ఒకప్పుడు సీక్వెల్స్ అంటే రెండు భాగాలతో ఆగిపోయేవాళ్లు దర్శకులు. కానీ ఇప్పుడలా కాదు.. వెబ్ సిరీస్ తీసినట్లు సినిమాలు కూడా తీస్తున్నారు. ఒక్కో కథకు మూడు నాలుగు భాగాలు కూడా రాసుకుంటున్నారు. హాలీవుడ్‌లో ఉన్న ఈ స్టైల్‌ను ఇండియన్ సినిమాకు.. మరీ ముఖ్యంగా సౌత్‌కు పరిచయం చేస్తున్నారు. మరి ఈ 3 పార్ట్ కల్చర్ ఏంటో చూద్దామా..? రెండున్నర గంటల రెగ్యులర్ సినిమా కాస్తా ఇప్పుడు ఆరేడు గంటలకు వెళ్లిపోయింది. అంత పెద్ద కథ సింగిల్ సినిమాలో చెప్పలేరు కాబట్టి రెండు, మూడు పార్ట్స్ కూడా చేస్తున్నారు మన దర్శకులు. కొందరు కేవలం మార్కెట్ కోసం చేస్తుంటే.. మరికొందరు మాత్రం సీరియస్‌గానే 3 పార్ట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ లిస్టులోకి అఖండ కూడా చేరిపోయింది. అఖండ సినిమాకు థర్డ్ పార్ట్ కూడా తీస్తామంటూ ప్రకటించారు బోయపాటి. దీనికి జై అఖండ అనే టైటిల్ కూడా లాక్ అయిపోయింది. సినిమా చివర్లో ఆ టైటిల్ కూడా వేసారు. పార్ట్ 3 ఉంటుంది కానీ ఎప్పుడుంటుందో క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు లూసీఫర్ కథను ముందు నుంచే మూడు భాగాలుగా ప్లాన్ చేసుకున్నామని తెలిపారు మోహన్ లాల్. దృశ్యం 3 ఆల్రెడీ వచ్చేస్తుంది. తెలుగులో ఇప్పటికే పుష్పకు ఇదే ఫార్ములా అప్లై చేసారు సుకుమార్. ఇప్పటికే 2 పార్ట్స్ వచ్చాయి.. రైజ్, రూల్ రప్ఫాడించాయి.. 2028లో ర్యాంపేజ్ కూడా ఉంటుందని కన్ఫర్మ్ చేసారు మేకర్స్. కేజియఫ్ విషయంలోనూ ఇదే చేస్తున్నారు ప్రశాంత్ నీల్. కేజియఫ్ 3 కూడా ఉంటుందని ఖరారు చేసారు ప్రశాంత్. అయితే పుష్ప 3, కేజియఫ్ 3 చెప్పినంత ఈజీ అయితే కాదు చేయడం. 3 పార్ట్స్ సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు.. కానీ దాన్ని మెటీరియలైజ్ చేసి చూపిస్తున్నారు మన దర్శకులు. పుష్ప 3, కేజియఫ్ 3కి టైమ్ పడుతుందేమో గానీ.. లూసీఫర్ 3 త్వరలోనే రావచ్చు. మరోవైపు అఖండ 3 వచ్చేస్తుంది. హిందీలో ధూమ్ 4, క్రిష్ 4కి రంగం సిద్ధమవుతుంది. మొత్తానికి సినిమాలు కూడా సిరీస్‌ల మాదిరే పార్ట్స్ వైజ్ వస్తాయేమో ఇక..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
హైబీపీతో గుండెకే కాదు.. కంటి చూపునకూ ముప్పే
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో

