పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
రాయదుర్గం సమీపంలోని సిరిగేదొడ్డి మహిళలు 40 ఏళ్లుగా పెరుగు వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు. వారి నాణ్యమైన పెరుగుకు రాయదుర్గంలో విశేష ఆదరణ ఉంది. మొదట కాలినడకన, ఇప్పుడు ఆటోలలో పెరుగు అమ్మి లాభాలు పొందుతున్నారు. గేదెలు కొనుగోలుకు సబ్సిడీ రుణాలు, ఆర్థిక సహాయం అందించి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
రాయదుర్గం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో గుమ్మగట్ట మండలం సిరిగేదొడ్డి గ్రామం ఉంది. ఇక్కడ దాదాపు వందల కుటుంబాలకు పాడి పోషణే ఆధారం. ఉదయం పితికిన పాలను పల్లెల్లో విక్రయిస్తారు. సాయంత్రం పాలను తోడు వేసి రాయదుర్గం పట్టణంలో మహిళలు పెరుగును విక్రయిస్తారు. పలు రకాల కంపెనీల పాలు, పెరుగు వచ్చినా సిరిగే దొడ్డి పెరుగుకు మాత్రం రాయదుర్గం చుట్టుపక్కల ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నాణ్యత, రుచిలో దీనికి సాటిలేదంటున్నారు స్థానికులు. గత 40 ఏళ్లుగా రాయదుర్గం పట్టణంలో పెరుగును విక్రయిస్తూ భర్తలకు తోడుగా నిలుస్తున్నారు ఆ ఊరి మహిళలు. సుమారు 100 మంది మహిళలు ఉదయాన్నే పెరుగు కుండలను నెత్తిన పెట్టుకొని నడుచుకుంటూ వచ్చి రాయదుర్గం పట్టణంలో విక్రయించే వారట. ప్రస్తుతం కూడా 40 మంది మహిళలు ప్రతిరోజూ ఆటోలో వెళ్లి పెరుగును విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు. వీరికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని అందిస్తే… మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందంటున్నారు సిరిగేదొడ్డి గ్రామం మహిళలు. బయట బజార్లో మూడు రూపాయలకు వడ్డీ తీసుకుని గేదలను కొనుక్కొని పెరుగు వ్యాపారం చేసుకుంటున్న తమకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని…. గేదెలు కొనుగోలు చేసుకునేందుకు సబ్సిడీపై రుణాలు ఇవ్వాలని కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అబ్బా జస్ట్ మిస్.. లేదంటే అఖండలో మనోజ్ కూడా రెచ్చిపోయేటోడు
Roshan Kanakala: విడాకులు తీసుకున్నారా అన్న ప్రశ్నకు రోషన్ షాకింగ్ రియాక్షన్
ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!
మూడు పూటలా అన్నమే.. అయినా కండలు తిరిగిన దేహం..
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?

