AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైబీపీతో గుండెకే కాదు.. కంటి చూపునకూ ముప్పే

హైబీపీతో గుండెకే కాదు.. కంటి చూపునకూ ముప్పే

Phani CH
|

Updated on: Dec 15, 2025 | 1:22 PM

Share

బీపీ ఎక్కువైతే గుండెకే కాదు, కంటి చూపుకు కూడా తీవ్ర ప్రమాదం. అధిక రక్తపోటు రెటీనాను దెబ్బతీసి, హైపర్‌టెన్సివ్ రెటినోపతీకి దారితీస్తుంది. ఇది దృష్టి మసకబారడం నుండి పూర్తిగా చూపు కోల్పోయే వరకు కారణం కావచ్చు. ప్రారంభంలో లక్షణాలు కనిపించవు కాబట్టి, 40 ఏళ్లు పైబడినవారు, బీపీ ఉన్నవారు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. జీవనశైలి మార్పులు, మందులతో బీపీని అదుపులో ఉంచుకోవడం అవశ్యం.

బీపీ ఎక్కువైతే అది గుండెపైనా ప్రభావం చూపుతుందని ఇప్పటి వరకూ మనకు తెలుసు. అందుకే బీపీని ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తారు. అంతేకాదు ఈ హై బీపీ పక్షవాతానికి కూడా దారితీస్తుంది. అందుకే దీనిని సైలెంట్‌ కిల్లర్‌ అంటారు. అయితే, ఈ హై బీపీ వల్ల కేవలం గుండెకే కాకుండా మన కంటిచూపునకు కూడా తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు నేరుగా కంటిలోని రెటీనాపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రెటీనా అనేది కంటిలో ఉండే అత్యంత సున్నితమైన కాంతి-గ్రహణ పొర. దీర్ఘకాలం పాటు బీపీ అధికంగా ఉంటే, రెటీనాలోని రక్తనాళాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఫలితంగా ఆ రక్తనాళాలు దెబ్బతినడం, గట్టిపడటం లేదా కుచించుకుపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితిని ‘హైపర్‌టెన్సివ్ రెటినోపతీ’ అని పిలుస్తారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ప్రారంభ దశలో దీని లక్షణాలేవీ బయటకు కనిపించవు. సమస్య ముదిరినప్పుడు దెబ్బతిన్న రక్తనాళాల నుంచి ద్రవాలు లేదా రక్తం లీక్ అవ్వడం మొదలవుతుంది. దీనివల్ల రెటీనాలో వాపు, దృష్టి మసకబారడం, కొన్ని సందర్భాల్లో పూర్తిగా చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాకుండా, హైపర్‌టెన్షన్ వల్ల దృష్టి నరం దెబ్బతినడం, రెటీనా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు. ఈ బ్లాకేజ్‌లు ఏర్పడటం అత్యవసర పరిస్థితి అని, వెంటనే చికిత్స తీసుకోకపోతే శాశ్వత అంధత్వం వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అందుకే 40 ఏళ్లు దాటిన వారు, ఇప్పటికే బీపీతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి మార్పులు, సరైన మందులతో రక్తపోటును అదుపులో ఉంచుకోవడం ద్వారా కంటిచూపును కాపాడుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు

అబ్బా జస్ట్ మిస్.. లేదంటే అఖండలో మనోజ్‌ కూడా రెచ్చిపోయేటోడు

Roshan Kanakala: విడాకులు తీసుకున్నారా అన్న ప్రశ్నకు రోషన్ షాకింగ్ రియాక్షన్