Allu Arjun: అల్లు అర్జున్ విషయంలో అదే నిజమైందా
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'AA22' సినిమాపై భారీ అంచనాలున్నాయి. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్-వరల్డ్ సైన్స్ యాక్షన్ డ్రామా కోసం హాలీవుడ్ VFX బృందాలతో కలిసి పనిచేస్తున్నారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ప్యాన్ వరల్డ్ హీరోగా ఈ చిత్రం ద్వారా నిరూపించుకోనున్నారు. బన్నీ మల్టిపుల్ లుక్స్‌లో, ముఖ్యంగా అండర్ వాటర్ సీక్వెన్సులతో 2027లో విడుదల కానుంది.
ప్యాన్ వరల్డ్ సినిమా చేస్తున్నపుడు.. ప్లానింగ్ కూడా అలాగే ఉండాలి.. అందులో తగ్గేదే లే అంటున్నారు అల్లు అర్జున్. అట్లీతో ఈయన చేస్తున్న సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్ బయటికొస్తుంది. అవి తెలుస్తున్న కొద్దీ బన్నీ ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఉరకలేస్తుంది. తాజాగా ఈ సినిమా గురించి మరో సెన్సేషనల్ అప్‌డేట్ బయటికొచ్చింది. మరి అదేంటో చూద్దామా..? పుష్పతో ప్యాన్ ఇండియన్ స్టార్ అయిన అల్లు అర్జున్.. పుష్ప 2తో ప్యాన్ వరల్డ్ హీరో అయిపోయారు. అందుకే అట్లీతో అలాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నారీయన. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అనేలా ఓ సైన్స్ యాక్షన్ డ్రామాకు తెర తీస్తున్నారు ఈ ఇద్దరూ. దాదాపు 600 కోట్లతో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ కూడా ఫాస్టుగానే జరుగుతుంది. అట్లీ సినిమాతో ఏకంగా హాలీవుడ్‌నే టార్గెట్ చేస్తున్నారు అల్లు వారబ్బాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ స్టూడియోస్‌లోని విజువల్ ఎఫెక్ట్స్ టీమ్స్‌తో టై అప్ అయిన వీడియోను విడుదల చేసారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి బన్నీ లుక్ బయటికొచ్చింది. కోర్ట్, మోగ్లీ సినిమా యూనిట్స్‌ను కలిసారు అల్లు అర్జున్.. అందులో ఆయన వింటేజ్ లుక్‌లో దర్శనమిచ్చారు. AA22 అనౌన్స్ చేసినపుడు బన్నీ లుక్ చాలా స్టైలిష్‌గా, హాలీవుడ్ హీరోగా ఉంది. ఇప్పుడేమో ఒకప్పటి వింటేజ్ లుక్‌లోకి మారిపోయారు. ఇందులో మరో లుక్ కూడా ఉంది. అట్లీ గతంలో మెర్సల్, తెరీల్లో విజయ్‌ను 3 గెటప్స్‌లో చూపించారు అట్లీ. బన్నీతోనూ అదే సీన్ రిపీట్ చేస్తున్నారు. ఇందులో అండర్ వాటర్ సీక్వెన్సులు హైలైట్ కానున్నాయి. 2027లో AA22 విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
హైబీపీతో గుండెకే కాదు.. కంటి చూపునకూ ముప్పే
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో

