రైతును పెళ్ళాడితే రూ.10 లక్షలు.. అంతే కాకుండా
రైతులకు వివాహ సమస్య తీవ్రంగా మారింది. కర్ణాటక రైతు సంఘాలు ఈ సమస్య పరిష్కారానికి సీఎం సిద్ధరామయ్యకు వినూత్న ప్రతిపాదన సమర్పించాయి. యువ రైతులను వివాహం చేసుకునే యువతులకు ప్రభుత్వం తరపున రూ. 10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశాయి. ఇది గ్రామీణ యువతకు సంబంధాలు రాకపోవడాన్ని పరిష్కరిస్తుందని, రైతుల సంక్షేమం కోసం మరిన్ని ప్రతిపాదనలు చేశాయి. ఈ 'పెళ్లి కానుక' చర్చనీయాంశంగా మారింది.
దేశానికి వెన్నెముకలాంటి వాడు రైతు.. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి ఆకలి తీర్చే అన్నదాత రైతు.. అలాంటి రైతుకు వివాహం అనేది పెద్ద సమస్యగా మారింది. ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది అతి ముఖ్యమైనది. అయితే ప్రస్తుత కాలంలో రైతు అంటేనే పిల్లనిచ్చేందుకు ఏ తల్లిదండ్రులూ ముందుకు రావడం లేదనేది ఒక చేదు నిజం. ఈ క్రమలో ఈ సామాజిక సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక రైతు సంఘాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందు ఒక వినూత్నమైన ప్రతిపాదనను ఉంచాయి. యువ రైతులను వివాహం చేసుకునే యువతులకు ప్రభుత్వం తరపున రూ. 10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మంగళవారం విధాన సౌధలో జరిగిన బడ్జెట్ సన్నాహక సమావేశంలో రైతు నేతలు ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే యువకులకు సంబంధాలు రాకపోవడం ఒక ‘సామాజిక విషాదం’గా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యువతులను వ్యవసాయ కుటుంబాల వైపు ప్రోత్సహించేందుకు ఈ ఆర్థిక సాయం ఎంతో దోహదపడుతుందని వారు వివరించారు. అంతేకాదు, పెళ్లి కానుకతో పాటు, రాబోయే బడ్జెట్‌లో రైతుల సంక్షేమం కోసం మరికొన్ని ప్రతిపాదనలు చేశారు. అందులో భాగంగా…రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి రూ. 20 వేల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగాల్లో రైతు బిడ్డలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలని, నిలిపివేసిన కిసాన్ సమ్మాన్ పథకాన్ని పునరుద్ధరించి, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా చూడాలని ప్రతిపాదన చేశారు. రైతు సంఘాల నుంచి వచ్చిన ఈ వినూత్న ప్రతిపాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి సీఎం సిద్ధరామయ్య ఈ ‘పెళ్లి కానుక’ డిమాండ్‌పై బడ్జెట్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విద్యార్థులపై హెడ్ మాస్టర్ ప్రతాపం.. విచక్షణ లేకుండా అలా ఎలా చేశారు సర్
ఎన్నో పాములను పట్టి ఎందరినో కాపాడాడు.. చివరికి..
జబర్దస్త్ నటుడికి దారుణ అనుభవం.. లేడీ అనుకుని పొలాల్లోకి లాక్కెళ్లి మరీ
అద్భుతం.. పెన్సిల్ మొనపై శివయ్య రూపం.. రికార్డుల రారాజు
Madhya Pradesh: భార్యతో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన భర్త
రైతును పెళ్ళాడితే రూ.10 లక్షలు.. అంతే కాకుండా
విద్యార్థులపై హెడ్ మాస్టర్ ప్రతాపం.. విచక్షణ లేకుండా..
ఎన్నో పాములను పట్టి ఎందరినో కాపాడాడు.. చివరికి..
అద్భుతం.. పెన్సిల్ మొనపై శివయ్య రూపం.. రికార్డుల రారాజు
భార్యతో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన భర్త
దారుణం.. ప్రేమించి దూరం పెడుతోందని యువతిపై సుత్తితో
తల్లి ప్రేమకు నోచుకోని చిట్టి కోతి.. బొమ్మతోనే తన బంధం

