AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జబర్దస్త్ నటుడికి దారుణ అనుభవం.. లేడీ అనుకుని పొలాల్లోకి లాక్కెళ్లి మరీ

జబర్దస్త్ నటుడికి దారుణ అనుభవం.. లేడీ అనుకుని పొలాల్లోకి లాక్కెళ్లి మరీ

Phani CH
|

Updated on: Feb 20, 2026 | 12:15 PM

Share

జబర్దస్త్ కమెడియన్ హరికృష్ణ లేడీ గెటప్‌లో పడిన కష్టాలను వెల్లడించారు. స్కిట్‌ల కోసం సొంత ఖర్చులు భరించడమే కాకుండా, ఆడవేషం కారణంగా ఆకతాయిల వేధింపులకు గురయ్యారు. ఒకప్పుడు డిమాండ్ ఉన్నప్పటికీ, ప్రస్తుతం అవకాశాలు లేక ఎమోషనల్ అయ్యారు. ఆయన ఆవేదన జబర్దస్త్ వెనుక ఉన్న అదృశ్య కష్టాలను తెలియజేస్తుంది.

జబర్దస్త్ కామెడీ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. అక్కడ కమెడియన్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది ప్రస్తుతం సినిమాలలో బిజీ బిజీగా ఉంటున్నారు. జబర్దస్త్ లో ఇప్పుడంటే లేడీ కమెడియన్లు ఉన్నారు. కానీ ఒకప్పుడు మేల్ యాక్టర్సే లేడీ గెటప్పులు వేసేవారు. చమ్మక్ చంద్ర మొదలు వినోదిని, తన్మయి, కొమరక్క ఇలా చాలా మంది లేడీ గెటప్పులతో బుల్లితెర ఆడియెన్స్ ను మెప్పించారు. అలా పలు జబర్దస్త్ స్కిట్లలో లేడీ గెటప్పుల్లో కనిపించిన వారిలో హరికృష్ణ ఒకడు. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. ఫొటో చూస్తే ఠక్కున గుర్తు పడతారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరైన ఇతను తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో పడన కష్టాలను అందరితో పంచుకున్నాడు. అలాగే జబర్దస్త్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. జబర్దస్త్ షో కోసం తాము ఎంతో కష్టపడ్డామని చెప్పిన హరికృష్ణ.. లేడీ గెటప్‌ కోసం.. కంపెనీ కాస్ట్యూమ్స్ కాకుండా తామే సొంతగా కాస్ట్యూమ్స్ సెట్ చేసుకునే వాళ్లమంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో.. తామే స్కిట్ ఖర్చు కూడా భరించేవాళ్లమని చెప్పుకొచ్చాడు.ఒకప్పుడు లేడీ గెటప్‌లు తా ము వేస్తే కామెడీ వేరే లెవెల్ లో వచ్చేదని.. అందుకు తగ్గట్టుగానే అప్పట్లో తమకు మంచి డిమాండ్ కూడా ఉండేదన్నాడు హరికృష్ణ. ఇక ఈ క్రమంలోనే.. కొన్నిసార్లు ఈ లేడీ గెటప్‌ వల్ల.. చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ హరికృష్ణ చెప్పుకొచ్చాడు. ఒకసారి తనను అమ్మాయి అని పొరబడిన కొందరు ఆకతాయిలు పొలాల్లోకి లాక్కెళ్లటానికి ట్రై చేశారని చెప్పుకొచ్చాడు. నాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పటికీ భయమేస్తుందన్నాడు హరికృష్ణ. ఈమధ్య తమకు అవకాశాలు రావడం తక్కువ అయ్యాయని.. కామెడీ స్కిట్లు చేయడం తప్ప తనకు మరే పని రాదంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అద్భుతం.. పెన్సిల్ మొనపై శివయ్య రూపం.. రికార్డుల రారాజు

Madhya Pradesh: భార్యతో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన భర్త

తెలుగు రాష్ట్రాల్లోను అమల్లోకి రానున్న SIR ప్రక్రియ

హైదరాబాద్ లో రూ. 13 వేల కోట్ల ఆన్ లైన్ గేమింగ్ ఫ్రాడ్

ఆదాయం కోట్లలో.. పన్ను కట్టడం రూపాయల్లో

Follow Us