సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
బృందావనం రాధాకృష్ణుల ప్రేమ నగరం. ఇక్కడ నిధివనంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. సూర్యాస్తమయం తర్వాత శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీలలు చేస్తాడని, ఉదయం ఖాళీ పాత్రలు, తడి విగ్రహాలు కనిపిస్తాయని భక్తుల నమ్మకం. ఈ మర్మమైన ప్రదేశంలో శ్రీకృష్ణుని రాత్రిపూట లీలలు, ఆయన అద్భుత ఉనికిని నమ్మేవారు దర్శించుకుంటారు.
రాధాకృష్ణుల ప్రేమ నగరం బృందావనంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. కృష్ణుడు నడయాడిన నేల బృందావనంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈనాటికీ శ్రీకృష్ణుని రూపాన్ని ఇక్కడ చూడొచ్చని భక్తులు చెబుతారు. ఆ దేవదేవుడిని దర్శించడానికి భక్తులు భారీ సంఖ్యలో బృందావనానికి వస్తారు. బృందావనంలో రంగ్ మహల్ అనే పాలెస్ ఉంది. సూర్యాస్తమయం తర్వాత నిధివన్‌లోకి భక్తులను అనుమతించరు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి రాత్రి శ్రీ కృష్ణుడు గోపికలతో కలిసి రాసలీలలు చేయడానికి నిధివనం రంగ మహల్‌కు వస్తాడు. గుడి తలుపులు మూసిన తర్వాత లోపలి నుంచి డ్యాన్స్, పాటల శబ్దం వినిపిస్తాయని అంటారు. నిధివన్‌లో సూర్యాస్తమయం తర్వాత శ్రీకృష్ణుడికి మంచినీరు, వెన్న, పంచదార రాధ కోసం మేకప్ సామాను, పండ్లు ఉంచుతారు.తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచినప్పుడు నీటి పాత్ర ఖాళీగా ఉంటుందని అక్కడున్న విగ్రహాలు తడిగా కనిపిస్తాయని అంటారు. కృష్ణాష్టమికి అలాగే హొలీ రోజున శ్రీ కృష్ణుడికి రంగులు అద్దడం కోసం భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. మత గ్రంథాలు స్థానికుల నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం మేం మీకు అందించాం. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదని మనవి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైబీపీతో గుండెకే కాదు.. కంటి చూపునకూ ముప్పే
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
అబ్బా జస్ట్ మిస్.. లేదంటే అఖండలో మనోజ్ కూడా రెచ్చిపోయేటోడు
Roshan Kanakala: విడాకులు తీసుకున్నారా అన్న ప్రశ్నకు రోషన్ షాకింగ్ రియాక్షన్
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో

