ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
రుద్రాక్షలు పరమేశ్వరుని కన్నులుగా హిందువులు పవిత్రంగా పూజిస్తారు. ఇవి రక్షణ, శాంతి, జ్ఞానం అందిస్తాయని నమ్ముతారు. ఆరోగ్య, మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయని శాస్త్రీయంగా రుజువైంది. సాధారణంగా హిమాలయ ప్రాంతాల్లో పెరిగే రుద్రాక్ష చెట్లు, ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా అడవి పాలెంలో దర్శనమిస్తున్నాయి. బాలకృష్ణ కృషి ఫలితంగా ఈ అరుదైన వృక్షాలు ఇక్కడ ఏపుగా పెరిగి కాయలు కాస్తున్నాయి.
రుద్రాక్ష అంటే సాక్షాత్తు పరమేశ్వరుని కన్నులు అని అర్థం. ఇవి హిందూమతంలో, ముఖ్యంగా శైవ సంప్రదాయంలో చాలా పవిత్రమైనవిగా భావించే చెట్టు గింజలు. వీటిని ధరించడం వల్ల రక్షణ, శాంతి, జ్ఞానం లభిస్తాయని నమ్ముతారు. ఈ గింజలకు వివిధ సంఖ్యలో ముఖాలు ఉంటాయి. ప్రతి ముఖానికి ప్రత్యేక శక్తి , ప్రయోజనాలు ఉంటాయి. రుద్రాక్ష ధారణ చేస్తే సాక్షాత్తు ఆ పరమశివుని అనుగ్రహం తమకు ఉన్నట్లు గానే భావిస్తారు హిందువులు. అంతే కాదు రుద్రాక్ష ధారణ వలన మానసిక ప్రశాంతత తో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రీయంగా కూడా రుజువైంది. దీంతో ప్రతి ఒక్కరు రుద్రాక్షలను మెడలో లేదా చేతికి ధరిస్తూ ఉంటారు. సామాన్యంగా రుద్రాక్షలు నేపాల్,హిమాలయాల పర్వత ప్రాంతాలు,భారత దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఈ చెట్టు ఇలియోకర్పస్ గనిట్రస్ అనే జాతికి చెందినది. ఈశాన్య రాష్ట్రాలలో పెరిగే ఈ రుద్రాక్ష చెట్లు ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం అడవి పాలెంలో దర్శనమిస్తున్నాయి. ఏపుగా పెరిగి రుద్రాక్ష కాయలతో కళకళలాడుతూ కనిపిస్తున్న ఈ దేవతా వృక్షాలను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ అధికారిగా పదవీ విరమణ చేసిన బాలకృష్ణ గతంలో వివిధ ప్రాంతాలలో పనిచేసినప్పుడు ఆ ప్రాంతాల నుండి అరుదుగా దొరికే మొక్కలను తమ గ్రామానికి తీసుకొచ్చి తన తోటలో నాటేవారు. అలా కొన్నేళ్ళ క్రితం తెచ్చిన అరుదైన మొక్కలే ఇప్పుడు వృక్షాలై రుద్రాక్షలు కాస్తున్నాయి. రుద్రాక్షలు ధరించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోవడంతో పాటు, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్ముతారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
హైబీపీతో గుండెకే కాదు.. కంటి చూపునకూ ముప్పే
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
అబ్బా జస్ట్ మిస్.. లేదంటే అఖండలో మనోజ్ కూడా రెచ్చిపోయేటోడు
Roshan Kanakala: విడాకులు తీసుకున్నారా అన్న ప్రశ్నకు రోషన్ షాకింగ్ రియాక్షన్
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో

