Hyderabad: హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్
హైదరాబాద్ శివార్లలోని కోత్వాల్‌గూడలో 35 ఎకరాల్లో భారీ కృత్రిమ బీచ్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. స్పెయిన్ సంస్థ ఫ్లూయ డ్రా భాగస్వామ్యంతో పబ్లిక్-ప్రైవేట్ మోడల్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చనుంది. లగ్జరీ విల్లాలు, అడ్వెంచర్ క్రీడలు, మానవ నిర్మిత సరస్సు, వేవ్ పూల్స్‌తో కూడిన ఈ బీచ్, భారతదేశంలోనే మొదటి ఇంటిగ్రేటెడ్ టూరిజం టౌన్‌షిప్‌గా నిలవనుంది.
అదేదో సినిమాలో హైదరాబాదులో బీచ్ సెట్ వేద్దాం అంటూ ఒక కామెడీ డైలాగ్ ఉంది. కానీ అది కామెడీ కాదు ఇప్పుడు నిజంగా హైదరాబాదులో బీచ్ రాబోతోంది. అదేంటి సముద్రం లేని హైదరాబాదులో బీచ్ అనుకోవద్దు అదే దీని స్పెషాలిటీ. ఆర్టిఫిషియల్ బీచ్ టూరిజం–ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా, అడ్వెంచర్ స్పోర్ట్స్‌తో కలిపి డిజైన్ చేస్తున్నారు.హైదరాబాద్ అవుట్‌స్కర్ట్స్‌లో ఔటర్ రింగ్ రోడ్‌కి దగ్గరగా ఉన్న కోత్వాల్‌గూడలో ఈ బీచ్ వస్తోంది.మొత్తం ప్రాజెక్ట్ విస్తీర్ణం సుమారు 35 ఎకరాలు అని ప్రభుత్వ–టూరిజం అధికారులు వెల్లడించారు.ఇది తెలంగాణ ప్రభుత్వ టూరిజం డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్‌లో అమలు అవుతోంది. ఈ మేరకు స్పెయిన్ కి చెందిన ఫ్లూయ డ్రా కంపెనీ ఫార్చ్యూన్ హాస్పిటల్ , తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ప్రాజెక్ట్ అంచనా వ్యయం దాదాపు రూ.350 కోట్లు గా నిర్ణయించారు.డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) పూర్తి చేసారు, 2025 డిసెంబర్‌లో నిర్మాణ పనులు ప్రారంభం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీన్ని ఫ్లాగ్‌షిప్ టూరిజం ప్రాజెక్టుగా, హైదరాబాద్‌ను గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా బ్రాండ్ చేయడమే లక్ష్యంగా చెబుతున్నారు నిర్వాహకులు. ఈ ఆర్టిఫిషియల్ బీచ్ సాధారణ పార్క్ కంటే మల్టీ-ఫీచర్ రిసార్ట్–ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లా ఉండేలా ప్లాన్ చేశారు.10 ఎకరాల విస్తీర్ణంలో విదేశాల నుంచి ఓసెనం సందర్బంగా ఇంపార్టెంట్ చేసి బీచ్ నిర్మాణం చేయబోతున్నారు. మిగిలిన 20 ఎకరాల్లో విలాసమంతమైన ప్రైవేట్ ఇల్లాలు నిర్మించబోతున్నారు. భారీ మాన్–మేడ్ లేక్, ఇసుక తీరాలు, వేవ్ పూల్స్‌తో నిజమైన బీచ్ ఫీల్ ఇవ్వడం కోసం ప్రత్యేకమైన టెక్నాలజీని వాడుతున్నారు ఆర్టిఫిషియల్ బీచ్ లో వాటర్ ని ప్యూరిఫై చేయటానికి ప్రత్యేకమైన ప్యూరిఫికేషన్ టెక్నాలజీని దీంట్లో వినియోగించబోతున్నారు.ఫ్లోటింగ్ విల్లాలు, లగ్జరీ హోటల్స్, స్టే ఫెసిలిటీస్ యాక్టివేషన్ బీచ్ ప్రాజెక్టులో ఉండబోతోంది. బంజీ జంపింగ్, సేలింగ్, స్కేటింగ్, బీచ్ వాలీబాల్ లాంటి ఆక్టివిటీలకు ప్రత్యేక జోన్లు.ఫ్యామిలీ జోన్‌లు: పార్కులు, పిల్లల ప్లే ఏరియాలు, సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ స్పేస్‌లు ఉంటాయి.ఫుడ్ కోర్ట్స్, థియేటర్లు, డెకరేటివ్ ఫౌంటెన్లు, నైట్ టైమ్ ఈవెంట్ కి ప్రత్యేకమైన స్పేస్ ఉంటుంది.దేశంలో ఇతర నగరాల్లో చిన్న స్కేల్ వాటర్‌పార్కులు, వేవ్ పూల్స్ ఉన్నా, ఇలాంటి ఇంటిగ్రేటెడ్ “ఆర్టిఫిషియల్ బీచ్ + టూరిజం టౌన్‌షిప్” కాన్సెప్ట్ దేశంలోనే తొలిసారి.ఇక ఇంటర్నేషనల్ వెల్నెస్ స్పాట్ రిసార్ట్ మరో ప్రత్యేకత. అంతర్జాతీయ పర్యాటకులు గెస్ట్లు హైదరాబాద్ వచ్చే విధంగా ఫైవ్ స్టార్ హాయిలో ప్రకృతిలో మమేకమై ఆయుర్వేదిక్ థెరపీలు యోగ మెడిటేషన్ క్లాసులు ట్రీట్మెంట్ అందే విధంగా ఇంటర్నేషనల్ వెల్నెస్ స్పా రిసార్ట్ తొందరలో అందుబాటులోకి రావడానికి ఎంతో సమయం పట్టదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పదేళ్ల రికార్డ్ బ్రేక్… మరో మూడు రోజులు బీ అలర్ట్
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో

