AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్‌..

మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్‌..

Phani CH
|

Updated on: Dec 15, 2025 | 4:12 PM

Share

ఆశలతో అత్తారింటికి వెళ్లిన నవ వధువుకు మొదటి రాత్రే భర్త షాకింగ్ నిజం చెప్పడంతో జీవితం అడియాస అయ్యింది. తాను దాంపత్య జీవితానికి పనికిరానని భర్త ఒప్పుకోవడంతో, ఆ యువతి మూడో రోజుకే విడాకులకు సిద్ధపడింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనలో పోలీసుల జోక్యంతో రూ.7 లక్షలు, కానుకలు తిరిగి ఇచ్చేలా రాజీ కుదిరింది.

కోటి ఆశలతో వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపాలని కలలుకన్న ఆ యువతి పెళ్లి చేసుకొని భర్తతో కలిసి అత్తవారింట్లో అడుగు పెట్టింది. కానీ, మొదటి రాత్రే ఆ నవ వధువు ఆశలు అడియాసలు అయ్యాయి. తన భర్త దాంపత్య జీవితానికి పనికిరాడని తెలుసుకున్న ఆ నవ వధువు.. చేసేది లేక..పెళ్లయిన మూడోరోజే తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గోరఖ్‌పూర్‌ పారిశ్రామిక అభివృద్ధి ప్రాధికార సంస్థ లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల యువకుడితో బేలియాపర్‌కు చెందిన యువతికి నవంబర్ 28న వివాహం జరిగింది. మరుసటి రోజు అప్పగింతల కార్యక్రమం అనంతరం వధువు అత్తవారింటికి వచ్చింది. అయితే, శోభనం రోజు రాత్రి ఆమె భర్త..తాను శారీరకంగా బలహీనుడనని, దాంపత్య సుఖం ఇవ్వలేనని స్వయంగా చెప్పడంతో వధువు దిగ్భ్రాంతికి గురైంది. దాంపత్య జీవితానికి పనికిరాని వ్యక్తితో తన జీవితాన్ని పంచుకోలేను అని ఆమె తన లీగల్ నోటీసులో పేర్కొంటూ కుటుంబంతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. డిసెంబర్ 1న అత్తింటిలో ఉన్న కూతురిని చూడటానికి వచ్చిన తండ్రికి నవ వధువు ఈ విషయం చెప్పటంతో వెంటనే ఆయన కూతురిని తీసుకుని తన ఇంటికి తీసుకుపోయాడు. అనంతరం ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం వరుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అతను తండ్రి కాలేడని తేలినట్లు వధువు కుటుంబ సభ్యులు తెలిపారు. రెండేళ్ల క్రితం కూడా అతనికి ఇదే కారణంతో పెళ్లైన నెలకే విడాకులు అయ్యాయని వారు ఆరోపించారు. విషయం పోలీస్‌ స్టేషన్‌కి చేరడంతో పోలీసుల జోక్యంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. పెళ్లి ఖర్చుల కింద రూ.7 లక్షలతో పాటు, ఇచ్చిన కానుకలన్నీ నెల రోజుల్లోగా తిరిగి ఇచ్చేందుకు వరుడి కుటుంబం అంగీకరించింది. ఈ మేరకు బంధువుల సమక్షంలో ఒప్పందం కుదిరిందని, సమస్య సామరస్యంగా పరిష్కారమవుతోందని పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyderabad: హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్

పదేళ్ల రికార్డ్‌ బ్రేక్‌… మరో మూడు రోజులు బీ అలర్ట్‌

ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు

సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు

హైబీపీతో గుండెకే కాదు.. కంటి చూపునకూ ముప్పే