The Raja Saab: రాజా సాబ్ ఇక్కడ.. మామూలుగా ఉండదు మరీ..
రాజా సాబ్ విడుదల సమీపిస్తున్న వేళ, ప్రభాస్, మారుతి భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ప్రభాస్ కొత్త లుక్‌లో ఫోటోషూట్ చేయగా, మారుతి "లెగసీ ఆఫ్ రాజా సాబ్" పేరుతో టెక్నికల్, VFX జర్నీ వీడియోలను సిద్ధం చేస్తున్నారు. జనవరి 9న రాజా సాబ్ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది, ముంబై, చెన్నై ఈవెంట్లతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.
ప్రమోషన్‌లు పలు రకములు.. దర్శక నిర్మాతలు ఏం చేసినా కూడా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికే..! అందుకే రాజా సాబ్ కోసం ప్రభాస్ ఓ రకంగా కష్టపడుతుంటే.. మారుతి మరో దారిని ఎంచుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి రాబోయే 25 రోజులు పెద్ద ప్లానింగే చేసారు. అది వర్కవుట్ అయితే రాజా సాబ్ ప్రమోషన్ మామూలుగా ఉండదు. మరి వాళ్లేం చేయబోతున్నారో తెలుసా..? రాజా సాబ్ షూటింగ్ అయిపోయింది.. పోస్ట్ ప్రొడక్షన్ కూడా చివరిదశకు వచ్చేసింది.. ఇక విడుదలవ్వడమే బ్యాలెన్స్. జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేసారు మేకర్స్. ఇప్పటికే ఐమాక్స్ లాంటి థియేటర్స్‌లో సర్‌ప్రైజ్ హార్రర్ వీడియోలను కూడా పంపించి ప్లే చేయిస్తున్నారు. అలా అన్నిచోట్లా ప్రమోషన్స్ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లిపోయాయి. రాజా సాబ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న వేళ.. ప్రభాస్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత ఈయన అదిరిపోయే ఫోటోషూట్ చేసారు. ఇన్నాళ్లూ మాస్ లుక్‌లో కనిపించిన ప్రభాస్.. కొత్తగా డార్లింగ్ లుక్‌లోకి మేకోవర్ అయ్యారు. చేతిలో పూలు, పళ్లు పట్టుకుని చాలా స్టైలిష్‌గా కనిపించారు రెబల్ స్టార్. మరోవైపు మారుతి కూడా రాజా సాబ్ ప్రమోషన్స్ కోసం కొత్త ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇకపై వరసగా ప్రమోషనల్ వీడియోలు ప్లాన్ చేస్తున్నారు. దీనికి లెగసీ ఆఫ్ రాజా సాబ్ అనే పేరు కూడా పెట్టారు. టెక్నికల్ జర్నీ, VFX జర్నీ, యాక్టర్స్ జర్నీ.. ఇలా వేటికవే సపరేట్‌గా సిద్ధం చేస్తున్నారు. రిలీజ్ వరకు ఈ ప్రమోషన్ కంటిన్యూ అవుతుందన్నారు మారుతి. జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. అంటే సరిగ్గా నెల రోజులు కూడా లేదు.. ఉన్న ఈ రోజుల్ని పర్‌ఫెక్టుగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ గ్యాప్‌లో ముంబై, చెన్నై సహా పలుచోట్ల ఈవెంట్స్‌కు ప్రణాళికలు రచిస్తున్నారు దర్శక నిర్మాతలు. వీటితో పాటు ఫౌజీ, స్పిరిట్ లాంటి సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్నారు ప్రభాస్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
హైబీపీతో గుండెకే కాదు.. కంటి చూపునకూ ముప్పే
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో

