AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతులేని కథగా మారుతున్న టికెట్ రేట్ల వ్యవహారం

అంతులేని కథగా మారుతున్న టికెట్ రేట్ల వ్యవహారం

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: Dec 15, 2025 | 3:37 PM

Share

సినిమా టికెట్ రేట్ల వివాదం టాలీవుడ్‌లో నిరంతర సమస్యగా మారింది. ప్రభుత్వ, పరిశ్రమల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కోర్టు కేసులు, ముఖ్యమంత్రి ప్రకటనలతో ఈ సమస్య మరింత సంక్లిష్టమవుతోంది. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఈ తరచుగా వచ్చే సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని ఈ కథనం వివరిస్తుంది, తద్వారా హైదరాబాద్ సినీ హబ్‌గా మారాలనే లక్ష్యం నెరవేరుతుంది.

ఇండస్ట్రీలో సినిమా టికెట్ రేట్ల ఇష్యూ అనేది సీరియల్‌లా సాగుతుంది. ఓసారి పెంచాలని.. మరోసారి పెంచొద్దని.. ఇంకోసారి ఎందుకు పెంచుతున్నారని.. ఇలా సాగుతూ ఉంది విషయం. తాజాగా ఇది మరో మలుపు తిరిగింది. వీటన్నింటికీ బ్రేక్ పడాలంటే ఓ అడుగు ఇండస్ట్రీ నుంచి.. మరో అడుగు ప్రభుత్వం నుంచి పడాల్సిన అవసరం ఉందా.. ? అదెలాగో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో టికెట్ రేట్ల మీద ఇష్యూ అనేది ఈరోజుది కాదు.. చాన్నాళ్లుగా జరుగుతూనే ఉంది. గతేడాది పుష్ప 2 ముందు వరకు అంతా బాగానే ఉన్నా.. అప్పుడు జరిగిన సంఘటన పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుపై ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి ఎక్కడో సమన్వయ లోపం అయితే కనిపిస్తూనే ఉంది. పుష్ప 2 ఘటన తర్వాత టికెట్ రేట్ల హైక్స్ ఉండవనే అనుకున్నారంతా. కానీ నిర్మాతల బాగోగులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే అంతపెద్ద ఇన్సిడెంట్ జరిగాక కూడా.. గేమ్ ఛేంజర్‌కు రేట్లు పెంచుకునే వెసలుబాటు కల్పించింది ప్రభుత్వం. పెంచిన రేట్లలో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలని ఈ మధ్యే చెప్పారు ముఖ్యమంత్రి. టికెట్ రేట్లు పెంచిన ప్రతీసారి.. ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లడం.. అక్కడ చర్చలు జరగడం కామన్ అయిపోయింది. నిన్న OG.. నేడు అఖండ 2 టికెట్ రేట్ల విషయంలోనూ ఇదే జరిగింది. కాకపోతే ఇక్కడ అఖండ నిర్మాతలకు ఊరటినిస్తూ ధరల పెంపుపై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజనల్ బెంచ్ రద్దు చేసింది. ఇదే సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రతీసారి రేట్లు పెంచడం.. విషయం కోర్టుకు వెళ్లడం.. ఇలా జరిగేకంటే దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి శాశ్వత పరిష్కారం చూపగలిగితే ఇండస్ట్రీకి చాలా మంచి జరుగుతుంది. హైదరాబాద్‌ను సినీ హబ్‌గా చేయాలనే ఆయన కోరిక కూడా నెరవేరుతుంది. ఇలా చేస్తే రాబోయే పెద్ద సినిమాలన్నింటికీ లాభం చేకూరడం ఖాయం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు

సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు

హైబీపీతో గుండెకే కాదు.. కంటి చూపునకూ ముప్పే

పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు

అబ్బా జస్ట్ మిస్.. లేదంటే అఖండలో మనోజ్‌ కూడా రెచ్చిపోయేటోడు

Published on: Dec 15, 2025 03:28 PM