AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kodad: చిన్న పిల్లలకే కాదు.. కుక్కలకు డైపర్ల వాడకం.. అందుకేనట

సాధారణంగా చిన్న పిల్లలు, ముఖ్యంగా నవజాత శిశువులకు సౌకర్యం కోసం డైపర్లు వాడుతుంటారు. పిల్లలకు మల, మూత్ర విసర్జన చేసే అలవాటు అయ్యేవరకు డైపర్లను వినిగిగిస్తుంటారు. కానీ పెంపుడు జంతువులకు డ్రెస్సులు వేస్తుంటారు. కానీ వాటికి డైపర్లు వాడుతున్న విషయం మీకు తెలుసా..? డైపర్లు జంతువులకు ఎక్కడ వాడుతున్నారో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.

Kodad: చిన్న పిల్లలకే కాదు.. కుక్కలకు డైపర్ల వాడకం.. అందుకేనట
Dog With Diaper
M Revan Reddy
| Edited By: |

Updated on: Feb 07, 2026 | 11:40 AM

Share

చిన్న పిల్లలకు డైపర్లు (Diapers) ప్రధానంగా మూత్ర, మల విసర్జన సమయంలో పరిశుభ్రత, సౌకర్యం, తల్లిదండ్రుల సౌలభ్యం కోసం వాడతారు. ఇవి పసిపిల్లల సున్నితమైన చర్మాన్ని తడి, దద్దుర్లు (Rashes) నుంచి రక్షించి, హాయిగా నిద్రపోవడానికి, కదలికలకు సహాయపడతాయి. ముఖ్యంగా ప్రయాణాల్లో, రాత్రి వేళల్లో తడి దుస్తులను పదేపదే మార్చే పని లేకుండా, ఇల్లు శుభ్రంగా ఉంచడానికి డైపర్లు బాగా ఉపయోగపడతాయి. అందుకే చిన్న పిల్లలకు డైపర్లు వాడుతారు. వృద్ధాప్యంలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా డైపర్లు వాడుతుంటారు. ఇంట్లో పెంచుకునే పక్షులు రెట్ట వేయకుండా కూడా డైపర్ల మాదిరి ఉండే వాటిని వాడుతుంటారు.

ఇటీవల పెంపుడు కుక్కలకు వ్యాధుల బారిన పడుతున్నాయి. దీంతో సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు వ్యాధుల సోకిన కుక్కలు చికిత్స కోసం వస్తున్నాయి. ముఖ్యంగా పార్వో వైరస్ సోకిన కుక్కలు దుర్వాసనతో కూడిన వాంతులు, రక్తపు విరేచనాలు చేసుకుంటున్నాయి. దీంతో అంటువ్యాధుల నివారణకు పార్వో వైరస్ సోకిన కుక్కలకు డైపర్ల వాడకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. పశువైద్యశాలలో వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్యం కోసం కుక్కలను తీసుకువచ్చే యజమానులు విధిగా డైపర్, డైపర్ షీట్స్ వావాడేలా ప్రోత్సహించి పార్వో వైరస్ వ్యాధి వ్యాప్తిని అరికడుతున్నారు. పార్వో వైరస్ అంటూ వ్యాధుల వ్యాపిస్తుందని, దీని నివారణకు డైపర్లు ఉపయోగపడుతున్నాయని వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ పెంటయ్య చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?