AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగులో తోప్ హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..

ఒకానొక సమయంలో సినిమాలు చేసి ఇప్పుడు కనిపించకుండా పోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కొంతమంది తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసిన వారుకూడా ఉన్నారు. వారిలో ఈ భామ ఒకరు. బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టి తెలుగులో సినిమాలు తగ్గించేసింది ఆమె..

తెలుగులో తోప్ హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 07, 2026 | 12:47 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఓ క్రేజీ హీరోయిన్. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.. తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు తెలుగులో సినిమాలు తగ్గించింది. కానీ కొన్నాళ్లుగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసినా కూడా ఈ అమ్మడికి అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది కానీ అక్కడ కూడా మెప్పించలేకపోయింది. తమిళ్ లోనూ సినిమాలు చేసిన అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని టాక్ వినిపిస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె ఎవరో కాదు తనే హీరోయిన్ క్రేజీ బ్యూటీ తాప్సీ. ఒకప్పుడు తెలుగులో రవితేజ, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ డమ్ అందుకుంది. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే హిందీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.

ఇవి కూడా చదవండి

కేవలం గ్లామర్ తోనే కాదు నటనతోనూ మెప్పించింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే తాప్సీ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని బీ టౌన్‌లో టాక్ వినిపిస్తుంది. ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియదు కానీ బాలీవుడ్ లో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఈ ముద్దుగుమ్మ కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు తాప్సీ. హిందీలో ఓ సినిమా చేస్తుంది. అలాగే ఎక్కడా కూడా పెద్దగా కనిపించడం లేదు.. సోషల్ మీడియాలోనూ పెద్దగా హడావిడి చేయడం లేదు. దాంతో తాప్సీ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీని పై తాప్సీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us