AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మానవ శరీరంలో అత్యంత ఖరీదైన భాగం ఏది? కోట్ల రూపాయల ధర పలికే ఆ సీక్రెట్‌ ఇదే!

మానవ శరీరం ప్రకృతి ప్రసాదించిన అద్భుతం. దీని విలువ కట్టడం అసాధ్యమైనప్పటికీ, అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం కొన్ని శరీర భాగాలు కోట్ల రూపాయల ధర పలుకుతున్నాయి. శరీరంలో అత్యంత ఖరీదైన అవయవం ఏది? ఒక గుండె లేదా కిడ్నీ విలువ ఎంత ఉంటుంది? ఇలాంటి విస్తుపోయే నిజాలను ఇక్కడ చూద్దాం..

మానవ శరీరంలో అత్యంత ఖరీదైన భాగం ఏది? కోట్ల రూపాయల ధర పలికే ఆ సీక్రెట్‌ ఇదే!
Organ Transplant FactsImage Credit source: freepik
Jyothi Gadda
|

Updated on: Apr 30, 2026 | 9:50 PM

Share

మానవ శరీర భాగాల విలువ గురించి, బ్లాక్ మార్కెట్‌లో వాటికి ఉండే డిమాండ్ గురించి తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. మానవ శరీరం ప్రకృతి ప్రసాదించిన అద్భుతం. దీని విలువ కట్టడం అసాధ్యమైనప్పటికీ, అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం కొన్ని శరీర భాగాలు కోట్ల రూపాయల ధర పలుకుతున్నాయి. శరీరంలో అత్యంత ఖరీదైన అవయవం ఏది? ఒక గుండె లేదా కిడ్నీ విలువ ఎంత ఉంటుంది? ఇలాంటి విస్తుపోయే నిజాలను ఇక్కడ చూద్దాం..

మానవ ప్రాణం వెలకట్టలేనిది. కానీ, అనారోగ్య కారణాల రీత్యా అవయవ మార్పిడి అవసరమైనప్పుడు లేదా అక్రమ వ్యాపారాల కోణంలో చూసినప్పుడు మానవ శరీర భాగాలకు విపరీతమైన ధరలు పలుకుతున్నాయి. ఒక సాధారణ మనిషి శరీరంలోని వివిధ అవయవాల విలువ అక్షరాలా కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా.

కోట్లలో పలికే గుండె విలువ:

మనుషులలో అత్యంత ఖరీదైన అవయవం గుండె. ఒక వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించే గుండెకు బ్లాక్ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. అంచనాల ప్రకారం, ఒక్క గుండె విలువ రూ. 7 కోట్ల నుండి రూ. 8 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇది శరీరంలోని అన్ని భాగాల కంటే అత్యంత ఖరీదైనది.

ఇవి కూడా చదవండి

కిడ్నీలు, కాలేయం:

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అవయవ మార్పిడి జరిగేది కిడ్నీలకే. ఒక్కో కిడ్నీ విలువ సుమారు రూ. 1.5 కోట్ల వరకు ఉంటుంది. ఇక కాలేయం (Liver) విషయానికి వస్తే, దీని విలువ సుమారు రూ. 3 కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. కాలేయానికి ఉండే ప్రత్యేకత ఏమిటంటే, ఇది తిరిగి పునరుద్ధరించబడే (Regenerate) శక్తిని కలిగి ఉంటుంది.

చిన్న భాగాలకు కూడా గిరాకీ:

కేవలం పెద్ద అవయవాలే కాకుండా, కళ్లు, చర్మం మరియు ఎముకలకు కూడా డిమాండ్ ఉంటుంది. రెండు కనుపాపల (Corneas) విలువ సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుంది. అలాగే, చర్మం, రక్తం కూడా నిర్ణీత ధరలకు అమ్ముడవుతుంటాయి. మనిషి చనిపోయిన తర్వాత కూడా కొన్ని భాగాలు వేరొకరికి ప్రాణదానం చేసేందుకు ఉపయోగపడతాయి.

అయితే, అవయవాలను విక్రయించడం లేదా అక్రమంగా సేకరించడం భారతీయ చట్టాల ప్రకారం కఠినమైన శిక్షార్హమైన నేరం. కేవలం స్వచ్ఛందంగా అవయవదానం చేయడం ద్వారా మాత్రమే ఇతరుల ప్రాణాలను కాపాడాలని సామాజిక కార్యకర్తలు మరియు వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us