AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 అడుగుల దూరం నుండి విషం చిమ్మే పాము.. కళ్లలో పడితే ఖతం.. అంతా చీకటి!

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటై 'యాషే స్పిట్టింగ్ కోబ్రా' (Ashe's Spitting Cobra) గురించి దాదాపు చాలా మందికి తెలియదు. ఇది తన విషాన్ని పిచికారీలా చిమ్మే విలక్షణమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది తన శత్రువుల లేదా వేటాడే జీవుల కళ్లను సరిగ్గా గురిచూసి విషాన్ని చిమ్ముతుంది. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.

10 అడుగుల దూరం నుండి విషం చిమ్మే పాము.. కళ్లలో పడితే ఖతం.. అంతా చీకటి!
Ashe's Spitting Cobra
Jyothi Gadda
|

Updated on: Apr 30, 2026 | 8:54 PM

Share

పాము కనిపిస్తే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. అయితే చాలా పాములు మనల్ని కరిస్తేనే విషం శరీరంలోకి చేరుతుంది. కానీ యాషే స్పిట్టింగ్ కోబ్రా (Ashe’s Spitting Cobra) విషయంలో మాత్రం కథ వేరు. ఇది మిమ్మల్ని కరవాల్సిన అవసరం లేదు, మీరు దాని దరిదాపుల్లో ఉంటే చాలు, దూరం నుండే మీపై విషపు దాడి చేస్తుంది. ఈ కోబ్రా తన విషాన్ని నోటి ద్వారా ఒక పిచికారీలా చిమ్ముతుంది. సుమారు 10 అడుగుల దూరం వరకు ఇది విషాన్ని విరజిమ్మగలదు. దీని గురి ఎంత ఖచ్చితంగా ఉంటుందంటే, ఇది నేరుగా ఎదుటి జీవి కళ్లను లక్ష్యంగా చేసుకుంటుంది. ఒకవేళ ఆ విషం కళ్లలో పడితే తీవ్రమైన మంట, కణజాలం దెబ్బతినడం, సరైన సమయంలో చికిత్స అందకపోతే శాశ్వత అంధత్వం సంభవించవచ్చు.

ఆఫ్రికాలోని కెన్యా, ఇథియోపియా, ఉగాండా వంటి ప్రాంతాల్లో ఈ పాములు కనిపిస్తాయి. స్పిట్టింగ్ కోబ్రా జాతులలోనే ఇది పరిమాణంలో అతిపెద్దది. సాధారణంగా ఇవి 6 నుండి 8 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ఇవి గోధుమ లేదా బూడిద రంగులో ఉండి, పొ పొదల్లో లేదా రాళ్ల మధ్య దాగి ఉంటాయి. నిజానికి ఈ పాము విషాన్ని చిమ్మడం అనేది దాని వేట కోసం కాదు, ఆత్మరక్షణ కోసం చేసే ప్రయత్నం. ఏదైనా పెద్ద జంతువు లేదా మనిషి తనను హాని చేస్తారని భావించినప్పుడు, అది తన పడగను విప్పి విషాన్ని చిమ్ముతుంది. ఒకవేళ విషం చిమ్మడం విఫలమైతే, అది కరవడానికి కూడా వెనుకాడదు. దీని విషం రక్తంపై, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

అడవిలో ప్రయాణించేటప్పుడు లేదా అరుదైన జీవుల ఫోటోలు తీసేటప్పుడు ఇటువంటి ప్రమాదకరమైన పాముల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతర పాములు ఆత్మరక్షణ కోసం కరుస్తాయి. కానీ, ఇది శత్రువు దగ్గరకు రాకముందే దూరం నుండే విషంతో దాడి చేసి తనను తాను రక్షించుకుంటుంది. 2007లో దీనిని ఒక ప్రత్యేక జాతిగా గుర్తించారు. దీనికి జేమ్స్ యాషే అనే నిపుణుడి పేరు మీదుగా యాషే అని పేరు పెట్టారు. అడవుల్లో లేదా ఇటువంటి పాములు ఉన్న ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ పాము హెచ్చరిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us