AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..! అయినా కలవలేదు

తెలుగులో కమెడియన్ గా నటిస్తూ మెప్పిస్తున్నాడు సుదర్శన్. పలు సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా హీరో ఫ్రెండ్ రోల్స్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..! అయినా కలవలేదు
Sudarshan
Rajeev Rayala
|

Updated on: Feb 19, 2026 | 3:42 PM

Share

టాలీవుడ్ లో కమెడియన్ గా ఎదుగుతున్నాడు నటుడు సుదర్శన్. పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్ రోల్స్ లో నటించి మెప్పించాడు సుదర్శన్. ముఖ్యంగా నెల్లూరు యాసలో మనోడు చెప్పే డైలాగ్స్ ప్రేక్షుకులను కడుపుబ్బా నవ్విస్తాయి. కమెడియన్ గా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు సుదర్శన్. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి సుదర్శన్ పలు విషయాలను పంచుకున్నాడు. అలాగే ఓ హీరో కోసం రోజంతా అతని ఇంటి గేటు దగ్గరే నిలబడ్డాను అని చెప్పాడు సుదర్శన్. ఇంతకూ ఆ హీరో ఎవరు.? ఎందుకు సుదర్శన్ ఆ హీరో ఇంటి గేట్ దగ్గర ఉన్నడో చూద్దాం. !

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సుదర్శన్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నాడు. తన ప్రభాస్ అంటే చాలా ఇష్టమని.. సుదర్శన్ ప్రభాస్‌కు వీరాభిమాని అని, వర్షం సినిమా నుండి ఆయన చిత్రాలను ఆసక్తిగా చూసేవాడిని అని తెలిపాడు. హైదరాబాద్ లో తన ఐఎల్స్ కోచింగ్ పూర్తయి, తిరిగి ఇంటికి బయలుదేరదామని అనుకుంటున్న సమయంలో ప్రభాస్ పుట్టినరోజు వచ్చిందని, అప్పుడు తాను ప్రభాస్ ఫ్యాన్స్ గ్రూపులలో యాక్టివ్‌గా ఉండేవాడినని తెలిపాడు సుదర్శన్.

ప్రభాస్ పుట్టినరోజున ఆయన ఎక్కడున్నా హైదరాబాద్ వస్తారని అనుకునేవాడిని.., హైదరాబాద్‌లోని ప్రభాస్ ఇంటి ముందు తెల్లవారుజామున ఆరు గంటల నుండి తన స్నేహితుడు మహేంద్రతో కలిసి ఎదురుచూశానని సుదర్శన్ గుర్తుచేసుకున్నారు. అప్పటికి మిర్చి సినిమా ఫోటోలు ఇస్తూ అభిమానులు వచ్చేవారు. బాహుబలి ప్రీ-ప్రొడక్షన్ సమయంలో ప్రభాస్ కేరళలో ఉన్నారని ఎంత చెప్పినా వినకుండా, వర్షంలో తడుస్తూ అక్కడే నిలబడి ఉన్నానని తెలిపారు. టిఫిన్, లంచ్, డిన్నర్ కూడా లేకుండా రాత్రి ఒంటిగంట వరకు వేచి ఉన్నాను. ప్రభాస్‌ను మళ్లీ కలిసి ఈ విషయం చెప్పాలని ఉందని, అయితే ఆ అవకాశం ఇంకా రాలేదని సుదర్శన్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us