Rajamouli : ఓరి దేవుడా.. హీరోగా వీడు దొరికాడేంట్రా బాబూ అనుకున్నా.. రాజమౌళి కామెంట్స్..
డైరెక్టర్ రాజమౌళి సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాల్లో లెవల్లో సత్తా చాటిన జక్కన్న.. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ సత్తా చాటాడు. ప్రస్తుతం వారణాసి సినిమాతో ఇంటర్నేషనల్ లెవల్లో మరోసారి ప్రభంజనం సృష్టించేందుకు రెడీ అయ్యాడు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

తెలుగు సినీ పరిశ్రమలో ఎస్.ఎస్. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే ఒక సంచలనం. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘స్టూడెంట్ నంబర్ 1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ‘RRR’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. అయితే, వీరి ప్రయాణం ప్రారంభంలో రాజమౌళి గారికి ఎన్టీఆర్ మీద ఒక రకమైన అపనమ్మకం ఉండేదట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు జక్కన్న. ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ, తన మొదటి సినిమా ‘స్టూడెంట్ నంబర్ 1’ ప్రారంభ సమయంలో ఎన్టీఆర్‌ను మొదటిసారి చూసినప్పుడు కలిగిన అనుభూతిని పంచుకున్నారు. డైరెక్టర్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ మొదలవుతున్నప్పుడు, ఎన్టీఆర్‌ను చూసి రాజమౌళి “ఓరి దేవుడా.. వీడు దొరికాడేంట్రా బాబూ” అని మనసులో అనుకున్నారట. అప్పట్లో ఎన్టీఆర్ కాస్త బొద్దుగా ఉండటం, మీసాలు సరిగ్గా రాకపోవడం, ఆయన నడక తీరు చూసి, తన మొదటి సినిమా ఇలాంటి హీరోతోనా అని మొదట్లో అనుకున్నానని.. కానీ తారక్ తన ఆలోచనలు అన్నింటిని తారుమారు చేశారని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Actress : ఎన్టీఆర్, ప్రభాస్‌లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
సినిమా షూటింగ్ మొదలైన పది రోజుల్లోనే రాజమౌళి అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని.. ఎన్టీఆర్ లోని అద్భుతమైన నటన, ఏ విషయాన్నైనా ఇట్టే పట్టేసే నేర్పు, ఆయన డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయానని వెల్లడించారు. ఒక సాధారణ వ్యక్తిగా కనిపించిన ఎన్టీఆర్, కెమెరా ముందుకు వచ్చేసరికి ఒక గొప్ప నటుడిగా మారిపోవడం తనను మంత్రముగ్ధులను చేసిందని అన్నారు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య ఒక బలమైన అనుబంధం ఏర్పడిందని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : కొబ్బరికాయ కుళ్లిపోయిందని ఆగిపోయిన సినిమా.. బాలయ్య, పవన్ ఆ మూవీ చూసుంటేనా.. డైరెక్టర్ కామెంట్స్..
కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ వీరిద్దరూ వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులు. సినిమా విజయం పొందినప్పుడు వచ్చే సంతోషం కొద్ది రోజులే ఉంటుందని, కానీ ఆ సినిమా కోసం కలిసి పనిచేసే ఒక సంవత్సరం కాలం జీవితాంతం గుర్తుంటుందని రాజమౌళి చెబుతుంటారు. ఎన్టీఆర్‌ను ఒక గొప్ప నటుడిగా రాజమౌళి గౌరవిస్తే, రాజమౌళిని ఒక గొప్ప దర్శకుడిగా ఎన్టీఆర్ ఆరాధిస్తారు. వీరిద్దరి మధ్య ఉన్న ఈ పరస్పర గౌరవం, స్నేహమే తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాలను అందించడానికి సహయపడింది.
ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: శ్రీకాంత్‌తో మూవీ తీస్తున్నప్పుడు.. ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: అతడు గొప్ప నటుడు.. నా జీవితంలో అలాంటి హీరోను చూడలేదు.. నా లైఫ్ పూర్తిగా మార్చేశాడు.. తనికెళ్ల భరణి..
