నాగార్జున నటించిన ఊపిరి సినిమాతో కెరీర్ ప్రారంభించింది పూజిత పొన్నాడ. ఆ తర్వాత నాగార్జున ప్రేమమ్ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించింది.
ఈ రెండు సినిమాల్లో తన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే పూజితకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఏదంటే రంగస్థలం అని చెప్పుకోవచ్చు.
ఇందులో ఆది పినిశెట్టి ప్రియురాలు పద్మ పాత్రలో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. సినిమాలో కనిపించింది కొంత సేపే అయినా తన నటనతో ఆకట్టుకుంది.
ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది వయ్యారి భామ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.. కానీ ఆ సినిమా అంత ఆకట్టుకోలేదు.
రాజుగాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, కల్కి, వేర్ ఈజ్ వెంకట లక్ష్మి, రన్, మిస్ ఇండియా, కథ కంచికి మనం ఇంటికి, ఓదెల రైల్వే స్టేషన్, రావణాసుర తదితర సినిమాల్లో నటించింది పూజిత.
అయితే ఎందుకోకానీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం రావడం లేదు. వరుసగా సినిమాలు చేస్తునా.. అందం అభినయం ఉన్నా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రావడంలేదు.
మొన్నామధ్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమాలో పూజిత కూడా కనిపించింది.