AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JD Chakravarthy : చిరంజీవితో నేను డైరెక్ట్ చేసిన సినిమా.. 80% షూట్ అయ్యాక ఆగిపోయింది.. కారణం ఏంటంటే.. జేడీ చక్రవర్తి..

జేడీ చక్రవర్తి మెగాస్టార్ చిరంజీవి పట్ల తన అభిమానాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. గతంలో చిరంజీవితో చేయాల్సిన అన్నయ్య వంటి చిత్రాలు, దర్శకత్వం వహించాల్సిన మహాత్మా గాంధీ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదో వివరించారు. దయా, గాయపడ్డ సింహం వంటి చిత్రాలతో తన కెరీర్‌లో వచ్చిన మార్పును పంచుకున్నారు.

JD Chakravarthy : చిరంజీవితో నేను డైరెక్ట్ చేసిన సినిమా.. 80% షూట్ అయ్యాక ఆగిపోయింది.. కారణం ఏంటంటే.. జేడీ చక్రవర్తి..
Jd Chakravarthy, Chirnajeev
Rajitha Chanti
|

Updated on: Apr 30, 2026 | 6:25 PM

Share

నటుడు జేడీ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ కెరీర్, మెగాస్టార్ చిరంజీవితో ఏర్పడాల్సిన అనుబంధం, ఇటీవల వచ్చిన చిత్రాలు, తన భవిష్యత్తు ప్రయాణం గురించి మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవికి తాను ఎంత పెద్ద అభిమానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయనను మొదటిసారి చూసినప్పటి నుండి ఇప్పటివరకు తనలో అదే ఉత్సాహం కొనసాగుతుందని జేడీ చక్రవర్తి అన్నారు. చిరంజీవితో జేడీ చక్రవర్తికి పలు ప్రాజెక్టులు దాదాపుగా ఖరారై, చివరి నిమిషంలో ఆగిపోయిన విషయంపై చర్చ జరిగింది. అన్నయ్య చిత్రంలో నటింపజేయడానికి తనను, శ్రీకాంత్‌ను సంప్రదించారని జేడీ తెలిపారు. శ్రీకాంత్ మొదట చేస్తానని చెప్పి, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల చేయలేనని డ్రాప్ అయ్యాడని వివరించారు. ఆ తర్వాత శ్రీకాంత్ స్థానంలో తాను చేయడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నానని, చేయను అని తాను అనలేదని స్పష్టం చేశారు. అలాగే, చిరంజీవి ప్రారంభించిన, జేడీ చక్రవర్తి దర్శకత్వం వహించాల్సిన మహాత్మా గాంధీ అనే చిత్రం 80% షూటింగ్ పూర్తయినా ఆగిపోయిందని వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తికాకపోవడం వెనుక ఒక పెద్ద కారణం ఉండవచ్చని, భవిష్యత్తులో చిరంజీవితో కలిసి ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉందని ఆశిస్తున్నట్లు జేడీ చక్రవర్తి అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: శ్రీకాంత్‏తో మూవీ తీస్తున్నప్పుడు.. ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..

ఈ మధ్యకాలంలో యువ దర్శకులకు మద్దతుగా నిలుస్తున్న తీరు గురించి మాట్లాడుతూ, శ్రీనివాస్ కశ్యప్ వంటి దర్శకులకు తోడుగా నిలవడం గొప్ప విషయమని జేడీ చక్రవర్తి అన్నారు. కంటెంట్ క్వీన్ అయితే, డైరెక్టర్ కింగ్ అనే కొత్త సిద్ధాంతాన్ని తాను ప్రచారం చేస్తున్నానని తెలిపారు. దీని ద్వారా దర్శకుడి ప్రాముఖ్యతను చెప్పారు. ఇటీవల విడుదలైన గాయపడ్డ సింహం చిత్రం టీజర్‌లో తన పాత్ర సత్య, మనీ వంటి తన పాత చిత్రాల రిఫరెన్సులు ఉన్నాయని వచ్చిన ప్రశంసలపై ఆయన స్పందించారు. దర్శకుడు స్పూఫ్‌లకు బదులుగా, తన పాత చిత్రాల నుండి రిఫ్లెక్షన్స్‌ను వాస్తవికతకు దగ్గరగా చూపించారని, అది ఒక కొత్త ఫామ్‌లో ఉంటుందని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: అతడు గొప్ప నటుడు.. నా జీవితంలో అలాంటి హీరోను చూడలేదు.. నా లైఫ్ పూర్తిగా మార్చేశాడు.. తనికెళ్ల భరణి..

గాయపడ్డ సింహం చిత్రం తన కెరీర్‌లో ఒక మార్పును తీసుకువచ్చిందని జేడీ చక్రవర్తి అంగీకరించారు. గతంలో చూజీగా, సెలెక్టివ్‌గా సినిమాలు చేసే తనను, ఇప్పుడు వేగంగా సినిమాలు చేయడానికి ప్రేరేపించిందని చెప్పారు. అయితే, ఈ మార్పు గాయపడ్డ సింహం కన్నా ముందు పవన్ సాధినేని దర్శకత్వంలో వచ్చిన దయా సిరీస్‌తోనే ప్రారంభమైందని జేడీ చక్రవర్తి స్పష్టం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ తనకు చాలా అవకాశాలు ఇచ్చిందని, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం పరిశ్రమ మద్దతేనని జేడీ చక్రవర్తి అన్నారు. తనకు గుర్తింపు రాలేదని చెప్పడం సరైంది కాదని, కావాల్సినంత గుర్తింపు వచ్చిందని, కానీ తాను మాత్రమే తనకు నచ్చిన అంశంతో ఒక కిక్ వచ్చే ప్రాజెక్టుల కోసం వేచి చూసి, సినిమాలకు బ్రేక్ ఇచ్చానని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : ఎన్టీఆర్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

ఎక్కువ మంది చదివినవి : Cinema : కొబ్బరికాయ కుళ్లిపోయిందని ఆగిపోయిన సినిమా.. బాలయ్య, పవన్ ఆ మూవీ చూసుంటేనా.. డైరెక్టర్ కామెంట్స్..

Follow Us