AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంకుల్లో డీజిల్‌ నో స్టాక్‌ బోర్డుల వెనుక విస్తుపోయే నిజాలు! వారి వల్లే ఈ దుస్థితి

మన దేశంలో డీజిల్ బల్క్, రిటైల్ ధరల మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. లీటరుకు రూ.50 వరకు తేడా ఉండడంతో బల్క్ వినియోగదారులు ఇప్పుడు చౌకైన రిటైల్ పంపుల నుంచి డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో చమురు కంపెనీల అమ్మకాలు 30-50 శాతం తగ్గుతూ, భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.

బంకుల్లో డీజిల్‌ నో స్టాక్‌ బోర్డుల వెనుక విస్తుపోయే నిజాలు! వారి వల్లే ఈ దుస్థితి
Diesel Prices
SN Pasha
|

Updated on: Apr 30, 2026 | 6:20 PM

Share

మన దేశంలో డీజిల్ ధరల్లో భారీ వ్యత్యాసాలు కనిపించడం వల్ల ఇంధన మార్కెట్‌లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా బల్క్ వినియోగదారులు ఇప్పుడు చౌకైన రిటైల్ పెట్రోల్ పంపుల నుంచి డీజిల్ కొనుగోలు చేయడం ప్రారంభించడంతో చమురు కంపెనీల అమ్మకాలపై గణనీయమైన ప్రభావం పడుతోంది. తాజా నివేదికల ప్రకారం, బల్క్ సెగ్మెంట్‌లో డీజిల్ అమ్మకాలు 30 నుంచి 50 శాతం వరకు తగ్గినట్లు తెలుస్తోంది.

ఈ పరిస్థితికి ప్రధాన కారణం బల్క్, రిటైల్ ధరల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం. ఉదాహరణకు ఢిల్లీలో బల్క్ వినియోగదారులకు డీజిల్ ధర లీటరుకు సుమారు రూ.134.5 కాగా, అదే డీజిల్ రిటైల్ పంపుల వద్ద రూ.87.6కే లభిస్తోంది. అలాగే విశాఖపట్నంలో బల్క్ ధర రూ.148.5 ఉండగా, రిటైల్ ధర రూ.96.4గా ఉంది. అంటే లీటరుకు రూ.47 నుంచి రూ.52 వరకు తేడా ఉండడం వినియోగదారులను రిటైల్ వైపు మళ్లిస్తోంది. ఈ పరిణామాలకు అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం కూడా ఉంది. ఇరాన్‌తో ఉద్రిక్తతలు, అలాగే స్ట్రెయిట్‌ ఆఫ్‌ హార్ముజ్‌ వద్ద ఏర్పడిన సంక్షోభం కారణంగా ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో చమురు కంపెనీలు రక్షణ, రైల్వేలు, మైనింగ్, పరిశ్రమలు వంటి పెద్ద వినియోగదారులకు డీజిల్ ధరలను పెంచాయి. అయితే సామాన్య ప్రజలపై భారం పడకుండా రిటైల్ ధరలను పెంచలేదు.

దీంతో కంపెనీలు రిటైల్ విక్రయాల్లో నష్టాలు చవిచూస్తుండగా, ఇప్పుడు బల్క్ వినియోగదారులు కూడా రిటైల్ పంపుల వైపు మళ్లడంతో ఆ నష్టాలు మరింత పెరుగుతున్నాయి. చిన్న పరిశ్రమలు, రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు, మత్స్య రంగానికి చెందిన సంస్థలు ప్రధానంగా ఈ మార్పుకు దోహదపడుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఆందోళన అవసరం లేదని చెబుతోంది. గతంలో ఉక్రెయిన్‌ వార్‌ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించిందని గుర్తుచేస్తోంది. ప్రస్తుతం కంపెనీలు మార్కెట్ వాటా కోల్పోయినా, ధరలను నియంత్రించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
"డీల్ నచ్చకపోతే మళ్లీ బాంబులే!".. ట్రంప్ వార్నింగ్
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?