AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Limit: మీ క్రెడిట్‌ కార్డు లిమిట్ తగ్గిందా? ఈ తప్పులు చేస్తున్నట్లే.. అప్పుడేం చేయాలి?

Credit Card Limit: మీ క్రెడిట్‌ కార్డులో ఉన్న పూర్తి మొత్తాన్ని వాడిన సమయంలో కూడా లిమిట్ తగ్గే అవకాశం ఉందంటున్నారు. మీరు కార్డు లిమిట్‌ను పూర్తిగా వాడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. మీ క్రెడిట్‌ కార్డు లిమిట్‌ తగ్గినట్లయితే ఆ ప్రభావం..

Credit Card Limit: మీ క్రెడిట్‌ కార్డు లిమిట్ తగ్గిందా? ఈ తప్పులు చేస్తున్నట్లే.. అప్పుడేం చేయాలి?
Credit Card
Subhash Goud
|

Updated on: Aug 01, 2026 | 8:12 AM

Share

Credit Card Limit: ప్రస్తుతం క్రెడిట్‌ కార్డుల వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. ఒకప్పుడు క్రెడిట్‌ కార్డు కావాలంటే ఎంతో ప్రాసెస్‌ ఉండేది. కానీ ఇప్పుడు కేవలం ఫోన్ల ద్వారానే వివరాలు తీసుకుని వారం రోజుల్లోనే క్రెడిట్‌ కార్డును జారీ చేసేస్తున్నాయి బ్యాంకులు. అయితే కార్డు వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. లేకుంటే అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అయితే బ్యాంకులు కూడా సమయానికి క్రెడిట్‌ కార్డు బిల్లులు చెల్లించడం, సిబిల్‌ బాగుండటం కారణంగా క్రెడిట్‌ కార్డు లిమిట్‌ను పెంచుతుంటాయి బ్యాంకులు. కానీ కొన్ని సమయాల్లో సరైన సమయానికి బిల్లు చెల్లింపులు చేసినా కార్డు లిమిట్‌ను తగ్గిస్తుంటాయి బ్యాంకు. ఆర్థిక సంస్థలు అనుకోకుండా కార్డు పరిమితి తగ్గించినప్పుడు వినియోగదారులు ఆందోళన చెందుతుంటారు. లిమిట్‌ను తగ్గించినప్పుడు ఏదైనా లోపం జరిగిందా? అని ఆందోళన చెందుతుంటారు వినియోగదారులు. అయితే బ్యాంకులు పరిమితులను తగ్గించేందుకు అనేక కారణాలుంటాయని, అవన్నీ ఆర్థిక ఇబ్బందులను సూచించవని వివరిస్తున్నారు. మరి, క్రెడిట్ పరిమితి​ తగ్గించడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం..

కార్డు వినియోగం తగ్గడం: క్రెడిట్‌ కార్డులను కస్టమర్లు సమయానికి వాడుతున్నారనే విషయాన్ని గమనిస్తుంటాయి బ్యాంకులు. ఒకవేళ కార్డును ఎక్కువ కాలం పాటు ఉపయోగించకుండా పక్కన పెడితే కొన్ని బ్యాంకులు ఆ కార్డు పరిమితిని తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు బ్యాంకు అధికారులు. బ్యాంకుల దృష్టిలో చూస్తే, వాడకుండా ఉన్న అకౌంట్లపై పెద్ద మొత్తంలో క్రెడిట్‌ లైన్‌ను కొనసాగించడం వాణిజ్యపరంగా లాభదాయకం కాదంటున్నారు.

ఇది కూడా చదవండి: Gas Cylinder Price: గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!

ఇవి కూడా చదవండి

అలాగే అత్యవసర పరిస్థితుల్లో లేదా ఆఫర్ల కోసం మాత్రమే వినియోగదారులు తమ వద్ద ఉంచుకునే సెకండరీ కార్డుల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుందని, అలాగే చాలా సందర్భాల్లో ఈ తగ్గింపు ఆర్థిక ఇబ్బందుల కంటే వినియోగదారుడి మారుతున్న అలవాట్లకు సంబంధించిందే అయి ఉంటుందంటున్నారు. క్రెడిట్ కార్డు లిమిట్ అకస్మాత్తుగా తగ్గడం చాలా మందిని ఆందోళనకు గురిచేస్తుంది. బ్యాంకులు లేదా క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థలు తమ రిస్క్‌ను తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంటాయి.

చెల్లింపుల విధానం:

అయితే క్రెడిట్‌ కార్డు బాకాయిల చెల్లింపులలో చిన్నపాటి సమస్య తలెత్తినా బ్యాంకులు తమ చర్యలు వేగవంతం చేస్తుంటాయంటున్నారు నిపుణులు. ఎక్కువగా ఆలస్యంగా చెల్లింపులు చేసినా, లేదా ఈఎంఐలోజాప్యం, క్రెడిట్‌ను ఎక్కువగా వాడటం లేదా ఆటో-డెబిట్‌ సక్సెస్‌ కాకపోవడం వంటివి కూడా పరిగణలోకి తీసుకుంటాయనట. ఈ క్రమంలోనే సిబిల్‌ స్కోరున్నప్పటికీ, బ్యాంకులు ముందు జాగ్రత్తగా కార్డు పరిమితిని తగ్గించవచ్చని అంటున్నారు. ముఖ్యంగా రుణాలపై ఎక్కువగా ఆధారపడటం, పూర్తి బాకీకి బదులు పదేపదే కనీస మొత్తం మాత్రమే చెల్లించడం, అనేక కార్డులపై రుణాలు పెరగడంలాంటివీ ఇందుకు కారణం అవుతాయంటున్నారు.

ఆదాయం తగ్గితే:

వినియోగదారుడి ఆర్థిక పరిస్థితి మారిందని సూచించే సమాచారం బ్యాంకులకు అందినప్పుడు క్రెడిట్‌ పరిమితి తగ్గే ప్రమాదం ఉందంటున్నారు. బ్యాంకు అకౌంట్లో జీతం రాకపోవడం, సరైన లావాదేవీలు జరగకపోవడం, లేదా ఉద్యోగాలు మారినా లేదా ఆదాయ స్థాయులు తగ్గినట్లు అనిపించినా కూడా బ్యాంకులు కన్నేస్తుంటాయి. అలాంటి సమయాల్లో క్రెడిట్ కార్డు లిమిట్‌ను తగ్గించే అవకాశాలున్నాయంటున్నారు. అలాగే మీరు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే విచారణలు పెరిగినా కూడా తగ్గే అవకాశాల ఉందంటున్నారు. ఎందుకంటే కస్టమర్​ నేరుగా బ్యాంకుకు సమాచారం ఇవ్వకపోయినా, రుణదాతలు తరచూ క్రెడిట్‌ బ్యూరో నుంచి సమాచారాన్ని, ఖాతాల వివరాలను పరిశీలిస్తూనే ఉంటారని చెబుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే మీ క్రెడిట్‌ లిమిట్‌ తగ్గినప్పుడు వెంటనే మరో కార్డు కోసం దరఖాస్తు చేయకూడదు. అలాంటి సమయాల్లో కూడా మీకు అత్యవసరం డబ్బులు అవసరం ఉన్నాయని సదరు బ్యాంకు భావిస్తుంది. అప్పుడు మీ దరఖాస్తును తిరస్కరించే అవకాశాలు కూడా ఉంటాయంటున్నారు. క్రిడెట్ యూటిలైజేషన్ రేషియో ఎక్కువగా ఉండటం: మీ మొత్తం క్రెడిట్ లిమిట్‌లో ఎల్లప్పుడూ 30% కంటే తక్కువ వాడాలని నిపుణులు సూచిస్తారు. మీరు మీ కార్డుపై ఎప్పుడూ మాక్సిమం లిమిట్ వరకు ఖర్చు చేస్తుంటే, మిమ్మల్ని ఆర్థికంగా రిస్క్ ఉన్న వ్యక్తిగా భావించి బ్యాంకులు లిమిట్ తగ్గిస్తాయి.

క్రెడిట్‌ కార్డును పూర్తిగా వాడితే..

మీ క్రెడిట్‌ కార్డులో ఉన్న పూర్తి మొత్తాన్ని వాడిన సమయంలో కూడా లిమిట్ తగ్గే అవకాశం ఉందంటున్నారు. మీరు కార్డు లిమిట్‌ను పూర్తిగా వాడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. మీ క్రెడిట్‌ కార్డు లిమిట్‌ తగ్గినట్లయితే ఆ ప్రభావం మీ సిబిల్‌ స్కోర్‌పై పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

అప్పుడేం చేయాలి?:

  1. బ్యాంకును సంప్రదించండి: మొదట మీ క్రెడిట్ కార్డు సంస్థ లేదా కస్టమర్ కేర్‌ను సంప్రందించి లిమిట్ ఎందుకు తగ్గించారో తెలుసుకోండి. మీ ఆదాయం పెరిగిందని లేదా మీ ఆర్థిక పరిస్థితి బాగుందని నిరూపించే పత్రాలను (Salary Slips) సమర్పించి లిమిట్‌ను మళ్లీ పెంచమని రిక్వెస్ట్ చేయవచ్చు.
  2. క్రెడిట్ యూటిలైజేషన్‌ను తగ్గించండి: మీ కార్డుపై ఉన్న బకాయిలను వెంటనే లేదా వీలైనంత త్వరగా చెల్లించండి. లిమిట్ తగ్గడం వల్ల మీ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో ఒక్కసారిగా పెరిగిపోతుంది. అందుకే బకాయిలు తగ్గించడం ద్వారా దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
  3. సిబిల్ రిపోర్ట్ చెక్ చేయండి: మీ క్రెడిట్ రిపోర్ట్‌లో ఏవైనా తప్పులు లేదా పొరపాట్లు ఉన్నాయేమో చూసుకోండి. ఒకవేళ ఏవైనా తప్పుగా ఉంటే వెంటనే సంబంధిత క్రెడిట్ బ్యూరోకు ఫిర్యాదు చేసి సరిదిద్దుకోండి.
  4. కాలక్రమేణా క్రమశిక్షణ పాటించండి: బిల్లులను ఎప్పుడూ గడువు తేదీలోగా పూర్తిగా చెల్లించే అలవాటు చేసుకోండి. ఇలా కొన్ని నెలల పాటు క్రమశిక్షణతో వ్యవహరిస్తే బ్యాంక్ మీ పాత లిమిట్‌ను పునరుద్ధరించే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ జోరందుకుంటున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us